Dhoni Behind Rahane’s Destruction: రహానే విధ్వంసం వెనుక ధోని హస్తం…

ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎక్కడలేని బజ్ క్రియేట్ అవుతుంది. నిన్న శనివారం ఈ రెండు జట్లు తలపడ్డాయి. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Published By: HashtagU Telugu Desk
Dhoni's Hand Behind Rahane's Destruction...

Dhoni's Hand Behind Rahane's Destruction...

Dhoni Behind Rahane’s Destruction : ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎక్కడలేని బజ్ క్రియేట్ అవుతుంది. నిన్న శనివారం ఈ రెండు జట్లు తలపడ్డాయి. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 158 పరుగుల టార్గెట్ను చెన్నై 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేధించింది. మొద‌ట‌ ముంబై 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబైకు ఓపెనర్లు రోహిత్‌ (21), ఇషాన్ కిషన్‌(32) పరుగులతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ 60 పరుగులు దాటింది. మంచి దూకుడుగా ఆడుతున్న ఇషాన్ వికెట్ కోల్పోవడంతో ముంబై పతనం మొదలైంది.

158 పరుగుల లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది..అయితే మొదట్లోనే చెన్నై జట్టుకి భారీ దెబ్బ తగిలింది. ఖాతా తెరవకుండానే డివాన్ కాన్వే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత రహానే ఆట మొదలైంది. చాలా క్లాస్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ట్రెడీషనల్ షాట్లు ఆడుతూ, వీలున్నప్పుడల్లా చెలరేగిపోయాడు. ఒకరకంగా రహానేలో ఇంత ఫైర్ ఉందా అనుకున్నారు అంత. క‌ళాత్మ‌క‌ షాట్లను ఆడుతూ ఐపిఎల్ 2023 టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 61 పరుగులతో మైదానంలో పరుగుల వరద పారించాడు. బౌలర్ అర్షద్ ఖాన్‌ వేసిన 4వ ఓవర్‌లో 6, 4, 4, 4, 4, 1 వరుస బౌండరీలతో 23 పరుగులు రాబట్టి బౌలర్ ని వణికించేశాడు.

నిన్న జరిగిన మ్యాచ్ లో హైలెట్ గా నిలిచాడు రహానే. రహానే విధ్వంసకర బ్యాటింగ్ తో ఇండియన్ క్రికెట్ లవర్స్ పండుగ చేసుకున్నారు. ఒక్కో షాట్ ఒక్కో డైమండ్ లా అనిపించింది. చాన్నాళ్ల తర్వాత రహానే ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించడంతో ప్రత్యర్థి జట్టు సైతం రహానే ఆటకు ఫిదా అయింది. నిజానికి రహానే మొయిన్ అలీ స్థానంలో వచ్చాడు. మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ… ధోని భాయ్ నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నాడు. ఎంతో నమ్మకంతో నన్ను మ్యాచ్ లోకి తీసుకున్నాడు. నీ మీద నమ్మకంతోనే నిన్ను బ్యాటింగ్ ఆర్డర్ లో పంపిస్తున్నాను అని ధోని (Dhoni) మాటలను రివీల్ చేశాడు. ఈ రోజు ఆట నీది.. ఒత్తిడికి గురికాకుండా ఆటను ఎంజాయ్ చెయ్యమని ధోని చెప్పాడని రహానే అన్నాడు.ధోని ఇచ్చిన సపోర్ట్ తోనే ముందుకెళ్లాను. నేను కూడా ఈ రోజు నా ఆటను బాగా ఎంజాయ్ చేశాను అంటూ రహానే చెప్పారు.

Also Read:  Chennai vs Mumbai వాంఖేడే లోనూ చెన్నై చెడుగుడు.. ముంబై పై ఘన విజయం

  Last Updated: 09 Apr 2023, 11:18 AM IST