Chahal- Dhanashree: ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ తమ విడాకుల తర్వాత మొదటిసారి మళ్ళీ కలిసి కనిపించే అవకాశం ఉంది. ‘సియాసత్’ రిపోర్ట్ ప్రకారం.. ఈ మాజీ దంపతులను ‘ద 50’ అనే కొత్త రియాలిటీ షో కోసం సంప్రదించారు. అయితే ధనశ్రీ లేదా చాహల్ ఈ షోలో పాల్గొనేందుకు అంగీకరించారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ ప్రస్తుతం వారు తమ టీమ్‌లతో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎక్కడ ప్రసారం అవుతుంది?
బిగ్ బాస్ మాదిరిగానే ‘ద 50’ షో కూడా జియో హాట్‌స్టార్, కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. భారతీయ ప్రేక్షకులు ఇంతవరకు చూడని ఒక సరికొత్త ఫార్మాట్‌తో ఈ షోను రూపొందిస్తున్నారు.
షో ప్రత్యేకత ఏమిటి?
ఈ షో కాన్సెప్ట్ చాలా భిన్నంగా ఉంటుంది. ఒక విలాసవంతమైన కోటలో 50 మంది కంటెస్టెంట్స్ ఎటువంటి కచ్చితమైన నిబంధనలు లేకుండా కలిసి ఉండాలి. నియమాలు లేకపోవడం వల్ల ఈ షోలో గందరగోళం, ఊహించని మలుపులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఈ షో కోసం సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, పాత బిగ్ బాస్ కంటెస్టెంట్లతో చర్చలు జరుపుతున్నారు.
Also Read: స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాత్కాలిక పరీక్షల క్యాలెండర్ విడుదల!
ఫ్రెంచ్ షో ఆధారంగా..
‘ద 50’ అనేది ప్రసిద్ధ ఫ్రెంచ్ సిరీస్ ‘Les Cinquante’ కి ఇండియన్ వెర్షన్. ఇదే ఫార్మాట్‌తో 2023లో అమెరికాలో ‘Los 50’ అనే షో టెలిముండోలో ప్రసారమైంది. అయితే ఈ ఇండియన్ వెర్షన్ ప్రీమియర్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు.
ధనశ్రీ-చాహల్ విడాకులు
ధనశ్రీ, చాహల్ 2020లో వివాహం చేసుకోగా ఫిబ్రవరి 2025లో వారు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ధనశ్రీ గతంలో ‘రైజ్ అండ్ ఫాల్’ అనే షోలో కనిపించినప్పుడు తన మాజీ భర్త గురించి తరచుగా ప్రస్తావించేది. ఒక ఎపిసోడ్‌లో వారి నిశ్చితార్థం, పెళ్లి, విడిపోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి ఆమె బహిరంగంగా మాట్లాడింది.
ధనశ్రీ ఆవేదన
తమ బంధం గురించి ధనశ్రీ మాట్లాడుతూ.. “అతనిలో మార్పులు కనిపిస్తున్నప్పటికీ నేను అతనిని, మా బంధాన్ని నమ్మాను. నా చుట్టూ ఉన్నవారికి నేను చాలా అవకాశాలు ఇస్తాను, అది నా బలహీనత. కానీ చివరికి నేను భరించలేకపోయాను. ఈ బంధం కోసం నా వంతుగా చేయగలిగినదంతా చేశాను. విడిపోయినప్పటికీ అతని క్షేమం గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను” అని మనసులో మాట పంచుకుంది.
