Site icon HashtagU Telugu

IPL 2023 Final: రెడ్ బుల్ తాగి బ్యాటింగ్ చేసిన: డెవాన్ కాన్వే

IPL 2023 Final

New Web Story Copy (69)

IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టైటిల్ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే ఖరీదైన పరుగులు చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు. కాన్వే 25 బంతుల్లో 47 పరుగులతో అదరగొట్టాడు. దాని ఆధారంగా జట్టు లక్ష్యాన్ని సాధించడంలో విజయవంతమైంది. అయితే డెవాన్ కాన్వే 25 బంతుల్లో 47 పరుగులు ఎలా సాధించాడో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ని షేర్ చేశాడు. ప్రస్తుతం కాన్వే చెప్పిన  లాజిక్ పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మీమెర్స్ సైతం కాన్వే లాజిక్ పై మీమ్స్ మొదలు పెట్టారు.

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ తో తలపడింది. ముందుగా గుజరాత్ బ్యాటింగ్ చేసింది. అనంతరం చెన్నై మైదానంలో అడుగుపెట్టింది. అయితే చెన్నై తరుపున డెవాన్ కాన్వే బ్యాటింగ్ చేసేందుకు వచ్చే ముందు రెడ్ బుల్ తాగి మైదానంలో అడుగు పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో డెవాన్ కాన్వే మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం ఇబ్బంది పెట్టింది. ఈ విరామ సమయంలో నేను చాలా కప్పుల టీ తాగుతూ మెలకువగా ఉన్నాను. నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్ళే ముందు మైక్ హస్సీ (బ్యాటింగ్ కోచ్) నాకు రెడ్‌బుల్ అవసరమని చెప్పాడు. మ్యాచ్ చాలా ఆలస్యం అయినందున మానసికంగా నన్ను నేను ఉత్సాహంగా ఉండేందుకు రెడ్ బుల్ తాగానని చెప్పాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఫైనల్ మే 28న జరగాల్సి ఉండగా, మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రిజర్వ్ డేను ప్రతిపాదించారు. అయితే రిజర్వ్ రోజు కూడా వర్షం పడింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో చెన్నై సూపర్ కింగ్స్‌కు లక్ష్యాన్ని అందించారు. రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ ని ఐదోసారి ఛాంపియన్‌గా నిలిపాడు.

Read More: Karnataka: ఫ్రీ బస్ అంటే ఇలాగే ఉంటుంది మరి.. వామ్మో ఏకంగా అంతమంది జనాల?