world cup 2023: గిల్ పై డెంగ్యూ ప్రమాదం..

ప్రపంచకప్ లో గిల్ ప్రదర్శన నిరాశపరుస్తుంది. అంచనాలను అందుకోవడంలో గిల్ విఫలం అవుతున్నాడు. ప్రపంచకప్ కు ముందు మెరుపులు మెరిపించిన శుభ్ మాన్ ప్రపంచకప్ లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఆరు మ్యాచులు జరిగితే గిల్ కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే ఆడాడు

world cup 2023: ప్రపంచకప్ లో గిల్ ప్రదర్శన నిరాశపరుస్తుంది. అంచనాలను అందుకోవడంలో గిల్ విఫలం అవుతున్నాడు. ప్రపంచకప్ కు ముందు మెరుపులు మెరిపించిన శుభ్ మాన్ ప్రపంచకప్ లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఆరు మ్యాచులు జరిగితే గిల్ కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే ఆడాడు. డెంగ్యూ ఫీవర్ కారణంగా తొలి రెండు మ్యాచులకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో పాటు అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న గిల్ పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి మ్యాచ్ లో కేవలం 16 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత బాంగ్లాదేశ్ పై 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ పై 26, ఇంగ్లాండ్ పై 9 పరుగులతో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.

ఓపెనర్ రోహిత్ శర్మ చెలరేగిపోతుంటే.. గిల్ కనీసం అతడికి తోడుగా నిలబడలేకపోతున్నాడు. దీంతో గిల్ ను పక్కనపెట్టి ఇషాన్ కిషన్ కు అవకాశం ఇస్తే బాగుటుందని అభిప్రాయపడుతున్నారు కొందరు. అయితే ఇక్కడ గిల్ ఆటను తక్కువ అంచనా వేయట్లేదు. వన్డే ఫార్మెట్లో గిల్ అద్భుతంగ అడగలేదు. పైగా వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిని దమ్మున్న ప్లేయర్. కానీ గిల్ ని డెంగ్యూ సమస్య ఇంకా వదిల్నట్లేదు. అవును డెంగ్యూ వల్లే గిల్ పెర్ఫార్మెన్స్ తగ్గిందని కొందరు అనలిస్టులు అంటున్నారు. పైగా డెంగ్యూ ద్వారా మనోడు 6 కిలోలు తగ్గాడు. అందుకే శుబ్ మన్ లో జోష్ తగ్గిందని అంచనా వేస్తున్నారు. మొన్నటివరకు గిల్ ని సపోర్ట్ చేసిన వాళ్లే ఇప్పుడు గిల్ కి విశ్రాంతి అవసరమని భావిస్తున్నారు.

తాజాగా గిల్ తన ప్రదర్శనపై రియాక్ట్ అయ్యాడు. ఆరంభ మ్యాచులు ఆడనందుకు చాలా బాధపడ్డానని, టీమిండియాకు దూరంగా ఉండటం ఎంత కష్టమో నేను ఆ బాధను భరించానని తెలిపాడు. డెంగ్యూ నుంచి కోలుకోవడం చాలా కష్టమని చెప్పిన అతను డెంగ్యూ ఎలా వచ్చిందో కూడా తెలియదని చెప్పాడు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టుకు ఉపయోగపడే ఆటగాడు కావాలి. ఇప్పుడిప్పుడే టీమ్​లో సెటిల్ అవుతున్న గిల్​కు ఇదే ఫస్ట్ వరల్డ్ కప్​. టోర్నీకి ముందు మెరుపులు మెరిపించి గిల్ మెగాటోర్నీలో అదేస్థాయిలో ఆడతాడనుకున్నారందరు. కానీ ఎక్స్​పెక్టేషన్స్​ రీచ్ కావడంలో గిల్ తడబడుతున్నాడు. అయితే గిల్ స్థానంలో ఇషాన్ ని తీసుకుంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.

Also Read: Inzamam-ul-Haq: ఇంజమామ్‌ రాజీనామా