Site icon HashtagU Telugu

WPL 2023: 28 బంతుల్లో 76 పరుగులు.. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం

DC

Resizeimagesize (1280 X 720) (1) 11zon

మహిళల ప్రీమియర్ లీగ్‌ (Women’s Premier League)లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో మెగ్ లానింగ్ జట్టు స్నేహ రాణా జట్టును సులభంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుజరాత్ జెయింట్స్ 106 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. ఈ మ్యాచ్‌లో మెగ్ లానింగ్ జట్టు కేవలం 7.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసి విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షెఫాలీ వర్మ సుడిగాలిలా విజృంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున షెఫాలీ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. షెఫాలీ వర్మ 28 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసింది. ఈ యువ బ్యాట్స్‌మెన్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు బాదింది.

షెఫాలీ వర్మతో పాటు కెప్టెన్ మెగ్ లానింగ్ 15 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగింది. తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు కొట్టింది. ఇద్దరు ఓపెనర్ల అద్భుత ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 7.1 ఓవర్లలో 10 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ స్నేహ రాణా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ జెయింట్స్ తరఫున కిమ్ గార్త్ 37 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేసింది. జార్జియా వేర్‌హామ్, హర్లీన్ డియోల్ వరుసగా 22, 20 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడారు.

Also Read: Virat Kohli Record: విరాట్ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..

మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 4 మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం. అంతకుముందు ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ప్రస్తుతం రెండోస్థానంలో ఉంది. ఆదివారం యుపి వారియర్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.