DC vs KKR: ఎట్టకేలకు విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. రాణించిన డేవిడ్ వార్నర్ ..!

ఐపీఎల్ 2023 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)నాలుగు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)ను ఓడించింది.

  • Written By:
  • Updated On - April 21, 2023 / 07:02 AM IST

DC vs KKR: ఐపీఎల్ 2023 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)నాలుగు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)ను ఓడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. ఢిల్లీ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు తమ 5 వరుస పరాజయాలను ఎట్టకేలకు ముగించి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 6 వికెట్లు కోల్పోయినా చివరికి 4 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. జట్టు తరఫున కెప్టెన్ డేవిడ్ వార్నర్ 57 పరుగులు చేశాడు.

128 పరుగుల స్కోరు ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనింగ్ జోడీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, పృథ్వీ షాలు మైదానంలోకి దిగారు. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా 11 బంతుల్లో 13 పరుగుల ఇన్నింగ్స్ ఆడి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో తొలి 6 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 1 వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.

Also Read: PKXI vs RCB: అదరగొట్టిన సిరాజ్… బెంగళూరు మూడో విజయం

ఢిల్లీ జట్టు 62 పరుగుల స్కోరు వద్ద మిచెల్ మార్ష్, 67 పరుగుల స్కోరు వద్ద ఫిల్ సాల్ట్ రూపంలో మూడవ మూడోవ వికెట్ తీశారు కేకేఆర్ బౌలర్లు. ఇక్కడ నుంచి డేవిడ్ వార్నర్ మనీష్ పాండేతో కలిసి నాలుగో వికెట్‌కు 30 బంతుల్లో 26 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 41 బంతుల్లో 57 పరుగుల ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్‌కు చేరుకున్న కెప్టెన్ డేవిడ్ వార్నర్ రూపంలో 93 పరుగుల స్కోరుపై ఢిల్లీ జట్టుకు నాలుగో దెబ్బ తగిలింది. దీని తర్వాత, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్ కూడా కీలక సమయాల్లో పెవిలియన్‌కు చేరుకున్నారు.

111 పరుగుల స్కోరు వద్ద 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరోసారి ఒత్తిడిలో పడింది. పిచ్‌పై ఉన్న అక్షర్ పటేల్ 22 బంతుల్లో 19 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కీలక సమయంలో జట్టు కోసం పనిచేశాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, కెప్టెన్ నితీశ్ రాణా తలా రెండేసి వికెట్లు తీశారు.