Deepak Chahar: టీ20 తొలి హ్యాట్రిక్‌ హీరో చాహర్ 32వ పుట్టినరోజు

చాహర్ లో టాలెంట్ ఉన్నప్పటికీ ఫిట్నెస్ కారణంగా జట్టుకు దూరమవుతుంటాడు. చాహర్ అద్భుతమైన రైట్ ఆర్మ్ స్వింగ్ మరియు స్ట్రైక్ బౌలర్. ఆరంభ ఓవర్లలో వికెట్లు తీయగల నేర్పు చాహర్‌కు ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ అయినా, ఐపీఎల్‌ అయినా తొలి ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తేగల సమర్ధుడు.

Published By: HashtagU Telugu Desk
Deepak Chahar

Deepak Chahar

Deepak Chahar: దీపక్ చాహర్.. ఈ పేరు వింటే ఫస్త్ ధోనీ గుర్తుకు వస్తాడు. ఐపీఎల్ లో చాహర్ ధోనీ లా మధ్య కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. క్యాచ్ లు మిస్ చేయడం, గెలిచే మ్యాచ్ లు తన వల్లే ఓడిపోవడం ఇవన్నీ ధోనీని చిరాకు పుట్టిస్తాయి. అయినప్పటికీ మ్యాచ్ అనంతరం ఇద్దరు కలిసిపోతారు. ధోనీ ఏవైడ్ చేస్తున్నప్పటికీ చాహర్ వెళ్లి మరీ ధోనీ గెలుకుతుంటాడు. వీల్లిద్దరి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

చాహర్ లో టాలెంట్ ఉన్నప్పటికీ ఫిట్నెస్ కారణంగా జట్టుకు దూరమవుతుంటాడు. చాహర్ అద్భుతమైన రైట్ ఆర్మ్ స్వింగ్ మరియు స్ట్రైక్ బౌలర్. ఆరంభ ఓవర్లలో వికెట్లు తీయగల నేర్పు చాహర్‌కు ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ అయినా, ఐపీఎల్‌ అయినా తొలి ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తేగల సమర్ధుడు. అంతర్జాతీయ టీ20లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి భారత బౌలర్‌ దీపక్‌ చాహర్‌. బంగ్లాదేశ్‌పై చాహర్ 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అయితే దీపక్ చాహర్ గాయాల కారణంగా భారత జట్టుకు ఆడే అవకాశం లభించట్లేదు.

చాహర్ 2023 డిసెంబర్1న భారత్ తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు.13 వన్డేల్లో 203 పరుగులు చేసి 16 వికెట్లు తీశాడు. 25 టీ20ల్లో 31 వికెట్లు తీశాడు. 2018 జూలై 8న భారత క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేసిన చాహర్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా, బౌలర్ గా రాణించాడు. ఎన్నో సార్లు తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను చిత్తు చేసిన ఈ టాలెంటెడ్ ఒకప్పుడు హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించాడు, కానీ గాయం అతని కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రస్తుతం అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. జట్టులోకి పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ ఆటగాడు ఈ రోజు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. సో హ్యాపీ బర్త్డే చాహర్.

Also Read: Naga Panchami 2024: నాగపంచమి ఎప్పుడు.. ఎలాంటి నియమాలు పాటించాలో మీకు తెలుసా?

  Last Updated: 07 Aug 2024, 02:12 PM IST