KL Rahul: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) అజేయ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసి అద్భుతమైన శతకం సాధించాడు. కేఎల్ రాహుల్ 60 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో ఇది అతని ఐదో శతకం. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ అజేయంగా 65 బంతుల్లో 112 పరుగులు చేశాడు. రాహుల్ 14 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి గుజరాత్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
రాహుల్ సెంచరీతో ఢిల్లీ భారీ స్కోర్
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (112*; 65 బంతులు, 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్‌లో సెంచరీ చేసిన తొలి కుడిచేతి బ్యాటర్‌గా, ఐపీఎల్‌లో తన ఐదో సెంచరీ నమోదు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ (21*), అభిషేక్ పోరెల్ (30), అక్షర్ పటేల్ (25) రాణించారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిశోర్, ప్రసిద్ధ్ కృష్ణలు తలో వికెట్ తీశారు.
Also Read: Covid-19: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడికి కరోనా.. రేపు జట్టులో జాయిన్?!
విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 8,000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ 243 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయి అందుకోగా, రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించి కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. టీ20లో వేగంగా 8,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ (213 ఇన్నింగ్స్‌లు) మొదటి స్థానంలో, బాబర్ అజామ్ (218) రెండో స్థానంలో ఉన్నారు. రాహుల్, కోహ్లీ, మహ్మద్ రిజ్వాన్ (244) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.