Marco Jansen: మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూటే వేరు అన్నట్టుగా కనిపించింది. వేలానికి ముందు ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న ప్రీతిజింతా 110 కోట్ల భారీ పర్స్ వాల్యూతో బరిలోకి దిగింది. ఆల్ రౌండర్లని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి జట్లకు చమటలు పట్టించింది. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉండాలన్న ఆమె కోరిక నిరవేరింది.
ప్రస్తుతం పంజాబ్ లో భారీ హిట్టర్లు, ఆల్‌రౌండర్లు, కెప్టెన్, స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లున్నారు. వీళ్ళ కోసం భారీగా ఖర్చు చేసింది. పంజాబ్ జట్టులో ఇప్పుడున్న ఆటగాళ్లను చూస్తే టైటిల్ చేజారే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటివరకు 17 సీజన్లు గడిచాయి. కానీ పంజాబ్ టైటిల్ ఒక్కసారి కూడా ముద్దాడలేదు. అయితే వచ్చే సీజన్లో టైటిల్ కల నిరవేరబోతుంది అనిపిస్తుంది. ఇదిలా ఉంటే సీజన్ కు ముందు పంజాబ్ కింగ్స్ కు మరో శుభవార్త అందింది.
Also Read: Minister Jupally Krishna Rao: కాంగ్రెస్ పాలన దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష: మంత్రి జూపల్లి
పంజాబ్ వేలంలో మార్కో జాన్సెన్ (Marco Jansen)ను 7 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే అతనికిచ్చిన వాల్యూ సరైనదేనని నిరూపించుకున్నాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా,శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జాన్సెన్ 7 వికెట్లతో అదరగొట్టాడు. అతని ప్రాణాంతక బౌలింగ్ ముందు శ్రీలంక లొంగిపోయింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 42 పరుగుల స్కోరుకే కుప్పకూలింది. ఈ సమయంలో మార్కో జాన్సన్ భయంకరమైన బౌలింగ్ తో విరుచుకుపడ్డాడు. 6.5 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్ బేస్ ధర 1.25 కోట్లు అయినప్పటికీ అతని ప్రతిభను గుర్తించి పంజాబ్ అతనికి భారీ వేల కట్టింది.
మార్కో జాన్సెన్ ఇప్పటి వరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్లో పరుగుల వరద పారించగలడు. ఐపీఎల్ లో అతను 100 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 600 పరుగులు చేశాడు. కాగా మార్కో విధ్వంసానికి పంజాబ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఇదే ప్రదర్శనను ఐపీఎల్ లో చూపిస్తే మనోడి పంట పండినట్టే.