Site icon HashtagU Telugu

David Warner: వార్నర్ కు ఝలక్ ఇచ్చిన ఆస్ట్రేలియా సెలెక్షన్ కమిటీ

David Warner

David Warner

David Warner: ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ 2025 సంవత్సరంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కి ఆడతానని చెప్పాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వార్నర్ పేరును పరిగణనలోకి తీసుకోబోమని ఆస్ట్రేలియా జట్టు జాతీయ సెలక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశారు. దీంతో వార్నర్ కు బిగ్ షాక్ తగిలినట్టైంది.

డేవిడ్ వార్నర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 112 టెస్ట్ మ్యాచ్‌లు, 161 వన్డేలు అలాగే 110 టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ ఫార్మెట్లో 26 సెంచరీలు మరియు 44.56 సగటుతో 8786 పరుగులు చేశాడు. వన్డేల్లో 22 సెంచరీలతో 6932 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని స్ట్రైక్ రేట్ 70.19. ఇది సాంప్రదాయ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ కంటే చాలా ఎక్కువ. వన్డే క్రికెట్‌లో.వార్నర్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో 7 సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో 9 సెంచరీలు సాధించాడు. 2019లో పాకిస్థాన్‌పై వార్నర్ 335 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్ ఆడిన 5వ అత్యధిక ఇన్నింగ్స్ ఇది. ఈ ఫార్మాట్‌లో వరుసగా ఆరుసార్లు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో 3277 పరుగులు చేశాడు. ఇందులో 337 ఫోర్లు కొట్టాడు. వార్నర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 18,995 పరుగులు, 49 సెంచరీలు మరియు 147 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ కాలంలో అతను 38 మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు 13 మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తా చాటాడు.

వార్నర్ ఐపీఎల్ లో 184 మ్యాచ్‌లలో 40.52 సగటుతో 6565 పరుగులు చేశాడు. వార్నర్‌కు మూడు అలన్ బోర్డర్ మెడల్స్ దక్కాయి. నాలుగు సార్లు నాలుగు మెడల్స్ దక్కించుకున్న స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాళ్లలో వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. వార్నర్ 143 బౌండరీలు కొట్టగా, రోహిత్ శర్మ 165 బౌండరీలు కొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Also Read: Pushpa 2: The రూల్ – స్పీడ్ తగ్గిన ‘పుష్ప’..కారణం అదేనా..?