World Cup 2023: నెదర్లాండ్స్ పై డేవిడ్ వార్నర్ సెంచరీ

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు .ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగింది.

world cup 2023: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు .ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. మార్కస్ స్టోయినిస్ స్థానంలో కెమరూన్ గ్రీన్‌ని జట్టులో స్థానం కల్పించారు. నెదర్లాండ్స్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. స్కాట్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని నెదర్లాండ్స్ జట్టు నాలుగు మ్యాచ్‌లలో ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్ ద్వారా స్టీవ్‌ స్మిత్‌ ఫామ్‌లోకి వచ్చాడు. ఆరంభం నుంచి ఆసీస్‌ ధాటిగా ఆడుతోంది. స్టీమ్‌ స్మిత్‌తో పాటు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. 68 బంతుల్లోనే 9 బౌండరీలు ఒక భారీ సిక్సర్‌ సాయంతో స్మిత్‌ 71 పరుగులు సాధించాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన డేవిడ్‌ వార్నర్‌.. ఈ మ్యాచ్‌లో కూడా శతకం బాదాడు

ఆస్ట్రేలియా జట్టు – డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్కస్ లాబుస్‌చాగ్నే, జోష్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ మరియు ఆడమ్ జంపా.

నెదర్లాండ్స్ జట్టు– విక్రమజీత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), సీబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్ మరియు పాల్ వాన్ మీకెరెన్.

Also Read: Pawan Kalyan : సొంత సినిమా పేరే మర్చిపోయిన పవన్ కళ్యాణ్.. ఆ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్..