World Cup 2023: ప్రపంచ కప్ లో డేవిడ్ భాయ్ 1000 పరుగులు

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. 2023 ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు.

World Cup 2023: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. 2023 ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ ఈ ఘనత సాధించాడు. వార్నర్ 19 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకుని అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ 20 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయగా వార్నర్‌ కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి వారి పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో స్ట్రెయిట్ డ్రైవ్‌తో బౌండరీతో వార్నర్‌ ఈ ఘనత సాధించాడు. కాగా ప్రపంచకప్‌లో వెయ్యికిపైగా పరుగులు చేసిన నాల్గవ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ తొలిసారిగా 2015లో వరల్డ్ కప్ ఆడాడు. ఆ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా, ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. సొంతగడ్డపై జరిగిన ఆ వరల్డ్ కప్ లో వార్నర్ 8 మ్యాచ్ ల్లో 345 పరుగులు చేసి ఆసీస్ చాంపియన్ గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

Also Read: Mynampally : కల్వకుంట్ల ఫ్యామిలీ కోట్లు దోచుకున్నారు తప్ప మెదక్ ను అభివృద్ధి చేయాలే – మైనంపల్లి