Site icon HashtagU Telugu

CSK vs RCB: నేడు చెన్నై వ‌ర్సెస్ ఆర్సీబీ.. చెపాక్ పిచ్ రిపోర్ట్ ఇదే!

CSK vs RCB

CSK vs RCB

CSK vs RCB: ఐపీఎల్ 2025 ఎనిమిదో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హై వోల్టేజ్ పోరు ఈ రోజు చెపాక్‌లోని ఏంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ (CSK vs RCB) జరగనుంది. టాస్ రాత్రి 7 గంటలకు ఉంటుంది. రెండు జట్లూ తమ తొలి మ్యాచ్‌ల్లో విజయాలతో ఉత్సాహంగా ఉన్నాయి. చెన్నై జ‌ట్టు.. ముంబై ఇండియన్స్‌ను, బెంగ‌ళూరు జ‌ట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించాయి. చెపాక్‌లో చెన్నై ఆధిపత్యం చూస్తే.. ఆర్సీబీకి ఈ మ్యాచ్ పెద్ద సవాలుగా కనిపిస్తోంది.

పిచ్ రిపోర్ట్

చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూల‌మ‌ని పేరుగాంచింది. గత మ్యాచ్‌లో నూర్ అహ్మద్ (4 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ముంబైని కట్టడి చేశారు. ఈ పిచ్‌పై బంతి బ్యాట్‌కి త‌గ‌ల‌టానికి బ్యాట్స్‌మెన్ క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. బౌండరీలు కొట్టడం బ్యాట్స్‌మెన్‌లకు కష్టతరం. 160-180 స్కోరు ఇక్కడ గెలుపును నిర్ణయించే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు చారిత్రాత్మకంగా ఆధిక్యం ఉంది. 78 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 46 సార్లు బ్యాటింగ్ జట్టు విజయం సాధించింది. ఛేజింగ్‌ జట్టు 32 సార్లు గెలిచింది.

హెడ్-టు-హెడ్ రికార్డ్

చెన్నై, ఆర్సీబీ జ‌ట్ల‌ మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు జరగ్గా, చెన్నై 21 సార్లు గెలిచి ఆధిక్యంలో ఉంది. బెంగ‌ళూరు 11 విజయాలతో ఉండ‌గా.. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. చెపాక్లో చెన్నై జ‌ట్టు 8-1తో ఆర్సీబీపై ఆధిపత్యం చెలాయించే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ 2008లో ఆర్సీబీ ఈ మైదానంలో చెన్నైపై విజ‌యం సాధించింది.

Also Read: CM Chandrababu : నేడు చెన్నై నగరంలో సీఎం చంద్రబాబు పర్యటన

వాతావరణం

చెన్నైలో శుక్రవారం ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 27-34 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. వర్షం పడే అవకాశం 10% మాత్రమే. గంటకు 21 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. మ్యాచ్‌కు వ‌ర్షం అంతరాయం లేనట్లు నివేదిక‌లు చెబుతున్నాయి.

రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో CSK స్పిన్ దళం అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్.. RCB బ్యాటింగ్ లైనప్‌ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా ఉంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్‌లపై ఆర్సీబీ ఆశలు పెట్టుకుంది. చెన్నై సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లో ఎవ‌రూ రాణిస్తారో చూడాల్సి ఉంది.