CSK vs LSG: ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించిన మార్కస్ స్టోయినిస్

చెన్నై చెపాక్ లో లక్నో చెన్నై సూపర్ కింగ్స్ కి షాక్ ఇచ్చింది. మార్కస్ స్టోయినిస్ దెబ్బకు చెన్నై బౌలర్లు చేతులెత్తేశారు. నికోలస్ పురాన్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి ఉత్కంఠ సమయంలో మార్కస్ స్టోయినిస్ ఒంటిచేత్తో మ్యాచ్ ని గెలిపించాడు.

CSK vs LSG: చెన్నై చెపాక్ లో లక్నో చెన్నై సూపర్ కింగ్స్ కి షాక్ ఇచ్చింది. మార్కస్ స్టోయినిస్ దెబ్బకు చెన్నై బౌలర్లు చేతులెత్తేశారు. నికోలస్ పురాన్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి ఉత్కంఠ సమయంలో మార్కస్ స్టోయినిస్ ఒంటిచేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో మార్కస్ స్టోయినిస్ కు ఇదే తొలి సెంచరీ. లక్నో సూపర్ జెయింట్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. సీఎస్‌కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. స్టోయినిస్ 124 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ అరాంభంలోనే వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్‌లు ఇన్నింగ్స్‌ బాధ్యతలు చేపట్టారు. రుతురాజ్ గైక్వాడ్ 60 బంతులు ఎదుర్కొని 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 22 బంతులు ఎదుర్కొన్న శివమ్ దూబే హాఫ్ సెంచరీ సాధించాడు . శివమ్ దూబే తన ఇన్నింగ్స్‌లో మొత్తం 7 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు. 244 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేసిన శివమ్ దూబే లక్నో బౌలర్లను చిత్తు చేశాడు.

ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో యశ్ ఠాకూర్ బౌలింగ్ చేశాడు. తన ఓవర్‌లో శివమ్ దూబే రెండు, మూడు, నాలుగో బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్‌లో శివమ్ దూబే తొలి బంతికే సిక్సర్ బాదాడు, అయితే ఆ ఓవర్ నాలుగో బంతికి అతను రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ రంగంలోకి దిగాడు. ధోనీ ఒక బంతి ఎదుర్కొని ఒక బౌండరీ కొట్టాడు. కాగా చెన్నై నిర్ణీత 20 ఓవర్ల నాటికి 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.

We’re now on WhatsAppClick to Join

211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో లక్నోకి ఆరంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే స్టార్ బ్యాట్స్ మెన్ క్వింటన్ డికాక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.చాహర్ వేసిన బంతిని డికాక్ ఆపే క్రమంలో టైమింగ్ కుదరక వికెట్ సమర్పించుకున్నాడు. 14 బంతుల్లో 16 పరుగులు చేసిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో మార్కస్ స్టోయినిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కష్టాల్లో ఉన్న లక్నో జట్టు బాధ్యతను తీసుకున్న మార్కస్ స్టోయినిస్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. 12 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ స్కోరు బోర్డులో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.కాగా లక్నో విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాలి. దీంతో మార్కస్ స్టోయినిస్ తొలి బంతికే సిక్సర్ బాదాడు. ఆ తర్వాత ఫోర్ కొట్టాడు. కాగా చివరి నాలుగు బంతులకి 2 పరుగులు కావాల్సిన సమయంలో ఫోర్ కొట్టి మ్యాచ్ ని ముగించేశాడు.

Also Read: CSK vs LSG: చితక్కొట్టిన గైక్వాడ్, దూబే.. ధాటిగా ఆడుతున్న స్టోయినిస్‌..