Devon Conway: సీఎస్‌కేకు బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడు దూరం..!

డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే సీజన్ ప్రారంభానికి ముందు పెద్ద షాక్ తగిలింది. డెవాన్ కాన్వే (Devon Conway) గాయం కార‌ణంగా మే వరకు లీగ్‌కు దూరంగా ఉండ‌నున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Devon Conway

Devon Conway

Devon Conway: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. లీగ్ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. CSK కీలక ఆటగాడు గాయం కారణంగా మే వరకు లీగ్‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే సీజన్ ప్రారంభానికి ముందు పెద్ద షాక్ తగిలింది. డెవాన్ కాన్వే (Devon Conway) గాయం కార‌ణంగా మే వరకు లీగ్‌కు దూరంగా ఉండ‌నున్నాడు. గత సీజన్‌లో ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కాన్వే కనీసం ఎనిమిది వారాల పాటు క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ వారంలో కాన్వే ఎడమ బొటన వేలికి శస్త్రచికిత్స చేయనున్నారు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో 32 ఏళ్ల డెవాన్ కాన్వే గాయపడ్డాడు. రెండో టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు కూడా రాలేకపోయాడు. అప్పటి నుంచి కాన్వే వైద్యబృందం పరిశీలనలో ఉంది. అయితే, ఇప్పుడు అతనికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో అతను మైదానంలోకి తిరిగి రావడానికి దాదాపు ఎనిమిది వారాలు పట్టవచ్చు.

Also Read: SSC Hall Tickets : ‘టెన్త్’ హాల్‌‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్ ఇలా

21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు

దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఇప్పటి వరకు IPL 2024.. 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీల తర్వాతే టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. ప్రస్తుతం ఏప్రిల్ 7 వరకు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 04 Mar 2024, 09:21 AM IST