Suresh Raina Restaurant: సురేశ్ రైనా యూరప్‌లో రెస్టారెంట్ (Suresh Raina Restaurant)ను ప్రారంభించనున్నట్లు సోషల్ మీడియాలో సమాచారం అందించారు. అతను శుక్రవారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 4 ఫోటోలను పంచుకున్నాడు. ఇందులో రైనా తన రెస్టారెంట్‌లో నవ్వుతూ వంట చేసుకుంటూ కనిపించాడు. రైనా గత కొంత కాలంగా కుకింగ్ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో నిరంతరం షేర్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడే తెలిసింది రైనాకి వంట చేయడం అంటే చాలా ఇష్టమని. అతని ఐపీఎల్ స్నేహితుడు ధోనీ వ్యవసాయం రంగంలోకి అడుగుపెట్టగా, రైనా ఫుడ్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మిస్టర్ ఐపీఎల్ అని పిలువబడే రైనా నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో రైనా రెస్టారెంట్ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు చెప్పాడు. సురేష్ రైనా పంచుకున్న చిత్రంలో అతను ఒక ప్లేట్‌లో గులాబ్ జామూన్‌తో కనిపించాడు. చెఫ్ డ్రెస్ వేసుకుని చేతిలో గులాబ్ జామూన్ ప్లేటుతో ఫోటోకి ఫోజులిచ్చాడు. సురేష్ రైనా సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. నేను ఎప్పుడూ క్రికెట్, వంటలను చాలా ఇష్టపడతాను. నేను వాటిల్లో రాణించగలను. భారతదేశం విభిన్న రుచిని ప్రజలకు అందించగలను. భారతీయ రెస్టారెంట్ తెరవడం అనే ఒక కల నిజమైంది. ఈ రెస్టారెంట్ అసాధారణమైన భోజన అనుభవాన్ని అందిస్తుందని రాసుకొచ్చాడు.
Also Read: Gavaskar: ఐపీఎలే ప్రామాణికం అయితే రంజీ ఎందుకు..? గవాస్కర్ ఫైర్..!
రైనా టీమిండియా తరపున 18 టెస్ట్ మ్యాచ్‌లు, 226 ODIలు, 78 T20 మ్యాచ్‌లు ఆడాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సురేశ్ రైనా రికార్డు అద్భుతంగా ఉంది. అదే సమయంలో ఐపిఎల్‌లో సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు గుజరాత్ లయన్స్ తరపున ఆడాడు. సురేష్ రైనా 205 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు. వన్డేల్లో 5,615, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 1605 పరుగులు చేశారు.