Site icon HashtagU Telugu

Praveen Kumar: ధోనీ , కోహ్లీ, సచిన్ పై మాజీ క్రికెటర్ కామెంట్స్

Praveen Kumar

Praveen Kumar

Praveen Kumar: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాహి కెప్టెన్సీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ప్రవీణ్ కుమార్ కోహ్లీ సచిన్ ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నపై స్పందించాడు. వివరాలలోకి వెళితే..

జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ తొలినాళ్లలో విధ్వంసక ఆటతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేవాడు. తన ఆట తీరుతో బీసీసీఐని ఆకట్టుకున్నాడు. దీంతో బీసీసీఐ తొలుత టీ20 టీమ్ పగ్గాలను ఇచ్చింది. ఆ తర్వాత వన్డే, టెస్టు సారథ్య బాధ్యతల్నీ అప్పగించింది. బీసీసీఐ నమ్మకాన్ని ధోనీ ఏనాడు వమ్ముచేయలేదు. తన అద్భుత కెప్టెన్సీతో 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ​లను భారత్​కు అందించాడు. టెస్టుల్లో టీమిండియాను నంబర్ వన్​ చేశాడు. క్రికెట్లో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ధోనీపై మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మాహీ ప్లేయర్లను వాడుకుంటాడని చెప్పాడు. కెప్టెన్లలో ధోనీనే బెస్ట్. ఒక ప్లేయర్​ను ఎలా యూజ్ చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. ఆటగాళ్లను ఎప్పుడు ఆడించాలి, ఎలా వినియోగించుకోవాలో అతడికి బాగా తెలుసని ప్రవీణ్​ కుమార్ అన్నాడు.

సచిన్‌-కోహ్లీలలో ఎవరు బెస్ట్‌ అన్న ప్రశ్నపై ప్రవీణ్‌ కుమార్‌కు మాట్లాడారు. సచిన్‌-కోహ్లీలో ఎవరు బెస్ట్‌ అని, సచిన్‌ ఎదుర్కొన్న బౌలర్లను కోహ్లీ ఎదుర్కొలేదు అని కొంతమంది అంటారు దాన్ని మీరు ఎలా చూస్తారని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. ప్రవీణ్‌ కుమార్‌ దానికి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. సచిన్‌ ఎంతో మంది టఫ్‌ బౌలర్లను ఎదుర్కొన్నాడు. అప్పుడున్న బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు చేశాడు. ఇప్పుడు కోహ్లీ కూడా కొత్త రకం బంతులను ఎదుర్కొంటున్నాడు.ఇద్దరు వారి వారి టైమ్‌లో గొప్ప ఆటగాళ్లని.. వాళ్లిద్దరిలో ఎవరు గొప్ప అంటే.. నాకైతే ఇద్దరు గొప్పే అని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపాడు.

Also Read: Ambati Rayudu: పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

Exit mobile version