SRH vs CSK: ఉప్పల్ లో పోలీసులకు, ఫ్యాన్స్ మధ్య గొడవ

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

SRH vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు తమ తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 20 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. .దీంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని రెండు జట్లు చూస్తు్న్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పవచ్చు.

మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. అభిమానులు కూడా భారీ సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీసులకు, వీక్షించేందుకు వచ్చిన అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. తాము కొనుగోలు చేసిన టిక్కెట్లను చూపించినా తమను లోనికి అనుమతించలేదని ప్రేక్షకులు ఆరోపించారు. కొందరు గేటు దగ్గరున్న బారికేడ్లను తోసుకోవడంతో గొడవ తీవ్రమైంది. అనంతరం పోలీసులకు, ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

We’re now on WhatsAppClick to Join

మ్యాచ్ విజయ అవకాశాలు ఎవరికీ ఉన్నాయో చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 53 శాతం గెలిచే అవకాశం ఉండగా, హైదరాబాద్ జట్టుకు 47 శాతం ఉంది. పిచ్ విషయానికి వస్తే ఇదివరకు ఇదే మ్యాచ్ లో సన్‌రైజర్స్‌-ముంబై తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 500కుపైగా పరుగులు నమోదయ్యాయి. దీంతో ఈ రోజు కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. చెన్నై – హైదరాబాద్‌ మధ్య ఇప్పటివరకూ 20 మ్యాచ్ లు జరగగా . అందులో చెన్నై సూపర్ కింగ్స్‌ 15 మ్యాచ్‌లు గెలవగా… సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 మ్యాచ్‌లు గెలిచింది. ఇక హైదరబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ 52 మ్యాచులు ఆడగా అందులో 31 మ్యాచ్‌లు గెలిచింది, 20 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇదిలా ఉంటె ఉప్పల్ స్టేడియానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఫ్యామిలీతో ఐపీఎల్ మ్యాచ్ చూడనున్నారు. దీంతో ఈ మ్యాచ్ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

Also Read: Pawan Kalyan : జ్వరం తగ్గడంతో మళ్లీ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్