Team India: భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు (Team India) లండన్ నుంచి లీడ్స్ వరకు రైలు ప్రయాణం చేసింది. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లు తమ బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో భారత ఆటగాళ్లు లండన్‌లోని హోటల్ నుంచి కాఫీ కప్పులు పట్టుకుని బయటకు వస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్ తన తండ్రి ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్)లో పోస్టింగ్‌లో ఉన్నప్పుడు ప్రయాణ సమయంలో తన తండ్రి ఎప్పుడూ విండో సీట్ బుక్ చేసేవారని చెప్పాడు. అదే విధంగా సాయి సుదర్శన్ తన బాల్యంలో క్రికెట్ శిక్షణ కోసం రైలులో ప్రయాణం చేసేవాడని తెలిపాడు. రైలు లోపల కేఎల్ రాహుల్ పోజులిస్తూ కనిపించాడు. అదే సమయంలో మోర్నే మోర్కెల్ అతని ఫోటోలు తీస్తున్నాడు. ఈ సందర్భంలో వాషింగ్టన్ సుందర్‌కు ఎవరో జుట్టు సరిచేయమని చెప్పగా సుందర్ హీరోల స్టైల్‌లో తన జుట్టును సెట్ చేస్తూ కనిపించాడు. హర్షిత్ రాణా కూడా టీమ్ ఇండియాతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అతన్ని అసలు భారత స్క్వాడ్‌లో చేర్చలేదని గమనించాలి.
Also Read: TGSRTC : తొలి మహిళా కండక్టర్లను సన్మానించిన టీజీఎస్ ఆర్టీసీ
London 🚄 Leeds
'Train'ing with #TeamIndia #ENGvIND pic.twitter.com/I1gBsTu0PC
— BCCI (@BCCI) June 18, 2025
శార్దూల్ ఠాకూర్ విండో సీట్ ఆనందం
శార్దూల్ ఠాకూర్ ముంబైకి చెందినవాడు. అతను క్రికెట్ సాధన కోసం రైలులో ప్రయాణించిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అతను ఇలా అన్నాడు. నేను ఈ రైలులో విండో సీట్‌ను బాగా ఆస్వాదిస్తున్నాను. కానీ ముంబైలో అలా కాదు. అక్కడ విండో సీటు కోసం ఒక యుద్ధమే చేయాలి. దానితో పోలిస్తే ఇక్కడ చాలా శాంతి ఉంది. ప్రస్తుతం విండో సీట్ సంపాదించి సంతోషంగా ఉన్నాను అని పేర్కొన్నాడు. ఈ సారి భారత జట్టు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తోంది. టీమ్ ఇండియా చివరిసారి ఇంగ్లాండ్‌ను పర్యటించినప్పుడు విరాట్ కోహ్లీ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.