Site icon HashtagU Telugu

Chris Gayle: క్రిస్ గేల్ మంచి మనసు.. ఫ్రీగా పెట్రోల్

Chris Gayle

Chris Gayle

Chris Gayle: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇంటర్నేషనల్ క్రికెట్​కు దూరమై చాన్నాళ్లు కావొస్తోంది. గేల్ చివరగా 2021లో ఆస్ట్రేలియాతో అబుదాబీ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్​లో ఆడాడు. వన్డేల్లో 2019లో టీమిండియాతో తన ఆఖరి సిరీస్​ ఆడాడు.

గేల్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించన్నప్పటికీ క్రికెట్ కు మాత్రం దూరంగా ఉంటున్నాడు. కానీ గేల్ ని ఫాన్స్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. కారణం తాను సోషల్ మీడియాలో యమ యాక్టివ్. నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానుల్ని అలరిస్తుంటాడు. తన లైఫ్ స్టైల్, డ్రింక్ పార్టీలకు సంబందించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటుంటాడు. తాజాగా గేల్ చేసిన పనికి అభిమానులతో పాటు నెటిజన్లు కూడా హర్షిస్తున్నారు. జమైకాలోని ఓ గ్యాస్ స్టేషన్​లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

వాహనదారులు గ్యాస్ ఫిల్లింగ్ కోసం ఎదురు చూస్తుండగా అదే సమయంలో గేల్ అక్కడికి వచ్చి సర్వప్రయిజ్ ఇచ్చాడు. గేల్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే గేల్ వాళ్లను మరింతగా సర్​ప్రైజ్ చేశాడు. ఆ గ్యాస్ స్టేషన్​లోని వెహికిల్స్​ అన్నింటి గేల్ బిల్లు చెల్లించాడు. దీంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాక యూనివర్సల్ బాస్ వారందరితో కలసి సెల్ఫీలు దిగాడు . దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర​ల్ అవుతున్నాయి.

Also Read: IND vs AFG: రోహిత్ పరుగుల వరద..121 పరుగులతో విధ్వంసం