Site icon HashtagU Telugu

Cheteshwar Pujara: క్రికెటర్ పుజారా బావమరిది ఆత్మహత్య.. కార‌ణ‌మిదే?!

Cheteshwar Pujara

Cheteshwar Pujara

Cheteshwar Pujara: భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) బావమరిది జీత్ రసిక్‌భాయ్ పాబ్రీ ఆత్మహత్య చేసుకున్నారు. ఉరి వేసుకుని ఆయన తన ప్రాణాలను తీసుకున్నారు. దీంతో పాబ్రీ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాబ్రీని ఆసుపత్రికి తరలించగా ..అక్కడ వైద్యులు ఆయనను మరణించినట్లు ప్రకటించారు. నవంబర్ 26, 2025న జీత్ పాబ్రీపై ఓ మ‌హిళ మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్‌లో బలవంతపు లైంగిక వేధింపుల ఫిర్యాదును నమోదు చేసింది. ఆ ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే ఆయన తన ప్రాణాలను తీసుకున్నారు.

ఆరోపణలు ఏమిటంటే?

జీత్ పాబ్రీ మాజీ కాబోయే భార్య చేసిన ఆరోపణల ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి జీత్ తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఫిర్యాదులో నిశ్చితార్థం జరిగిన తర్వాత సంబంధాలు పెట్టుకున్నారని, ఆ తర్వాత నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారని పేర్కొనబడింది.

Also Read: Commonwealth Games: అహ్మదాబాద్‌లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!

పుజారా కుటుంబ నేపథ్యం

చతేశ్వర్ పుజారా మామగారి ఊరు వాస్తవానికి జమ్‌జోధ్‌పూర్.. కానీ వారి కుటుంబం గత 20 సంవత్సరాలుగా రాజ్‌కోట్‌లో నివసిస్తోంది. ఈ కుటుంబానికి పత్తి మిల్లు ఉంది. చతేశ్వర్ పుజారా భార్య పేరు పూజ. ఆమెకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. పూజ గోండల్‌లో జన్మించారు. పదవ తరగతి వరకు అబూలోని సోఫియా స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత 11-12 తరగతి వరకు అహ్మదాబాద్‌లో చదివారు. ఆమె ముంబై నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

చతేశ్వర్ పుజారా విషయానికి వస్తే ఆయన స్వయంగా రాజ్‌కోట్‌కు చెందినవారు. ఆయన ఈ ఏడాది ఆగస్టులోనే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన చివరిసారిగా 2023లో భారత జట్టు తరఫున ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు.

Exit mobile version