Site icon HashtagU Telugu

Chetan Sharma: చీఫ్ సెలక్టర్ గా మళ్ళీ చేతన్ శర్మకే బాధ్యతలు

Chetan Sharma

Resizeimagesize (1280 X 720)

ఊహించిందే జరిగింది.. అంతా అనుకున్నట్టుగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా చేతన్ శర్మ (Chetan Sharma)నే బోర్డు మరోసారి ఎంపిక చేసింది. టీ ట్వంటీ ప్రపంచకప్ లో వైఫల్యం తర్వాత చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. అనంతరం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో ప్రక్షాళణ మొదలైందని భావించారు. దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాలని నిబంధనలు విధించింది. అంతేకాకుండా అభ్యర్థులు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం 5 సంవత్సరాలు పూర్తయి ఉండాలని పేర్కొంది.

సెలక్టర్ పదవి కోసం దాదాపు 600 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో నుంచి తుది జాబితాగా 11 అప్లికేషన్లను తీసుకుంది బోర్డు. చేతన్ శర్మ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ 11 మందిని ఇంటర్యూ చేసిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ వారిలో నుంచి ఐదుగురిని ఎంపిక చేసింది. ఇంటర్వ్యూల ఆధారంగా చేతన్ శర్మ, శివ సుందర్ దాస్, సుబ్రోతో బెనర్జీ, సలిల్ అంకోల, శ్రీదరన్ శరత్‌లను ఎంపిక చేసింది. చేతన్ శర్మను కమిటీ చైర్మన్‌గా నియమించిందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.

Also Read: (Suryakumar Yadav: మళ్ళీ చెబుతున్నా.. ఇది నా అడ్డా

సెలెక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్న మాజీ టెస్ట్ ఓపెనర్ శివ సుందర్ దాస్ సెంట్రల్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించనుండగా.. మాజీ పేసర్ సుబ్రోతో బెనర్జీ ఈస్ట్ జోన్, సలిల్ అంకోల వెస్ట్ జోన్, శ్రీధరన్ శరత్ సౌత్ జోన్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే చీఫ్ సెలక్టర్ గా చేతన్ శర్మ తప్పిస్తే మరొకరు సీఈసీని ఇంటర్యూలో మెప్పించలేకపోయారు. దీంతో మరోసారి చేతన్ కే బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా చీఫ్ సెలక్టర్ కు 1.25 కోట్లు , సెలక్టర్లకు 1 కోటి రూపాయల చొప్పున వార్షిక్ వేతనం లభించనుంది.