Site icon HashtagU Telugu

WTC Final 2023: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ

Virat Kohli

Virat Kohli Big Record In Ind Vs Aus Ahmedabad test

WTC Final 2023: లండన్‌లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో భారత జట్టు WTC ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్లకు 270 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లి (44), అజింక్యా రహానే (20) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. చివరి రోజు అంటే ఈరోజు భారత జట్టు 280 పరుగులు చేయాల్సి ఉంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదో రోజు 280 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లి, రహానే అజేయంగా పెవిలియన్‌కు చేరుకున్నారు. ఈ పరిస్థితిలో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లపై అభిమానులు మరియు జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. విరాట్ కోహ్లి భారీ స్కోరు సాధిస్తాడని భారత జట్టు అంచనాలు పెట్టుకుంది. మరో ప్లేయర్ రహానే కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా రాణిస్తాడని జట్టు భావిస్తుంది.

విరాట్ కోహ్లీ ఇంతకుముందు చాలాసార్లు భారత్‌ను విజయపథంలో నడిపించాడు, అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా నుండి ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచేందుకు పరుగుల వేటను ప్రారంభించినట్టు ఐసీసీ పేర్కొంది. నాల్గవ-ఇన్నింగ్స్ ఛేజింగ్ ది ఓవల్‌లో 262 పరుగుల రికార్డును మాత్రమే కాకుండా, 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ నెలకొల్పిన 418 పరుగుల ఆల్-టైమ్ బెంచ్‌మార్క్‌ను బద్దలు కొట్టింది. అయితే కోహ్లి క్రీజులో ఉండడంతో ఆశలు చిగురించాయని పేర్కొంది. అలాగే కోహ్లీ ప్రస్తుతం ఛేజ్ మాస్టర్’గా ప్రసిద్ది చెందాడని ప్రశంసించింది.

డబ్ల్యుటిసి ఫైనల్‌కు ముందు కోహ్లి ఐసిసితో మాట్లాడుతూ “భారత్‌ కోసం నేను ఆడే ప్రతి గేమ్‌లో నా జట్టును గెలిపించడానికి నాకు అవకాశం ఉందని నేను భావిస్తాను. క్రీడలో అంతకంటే పెద్ద ప్రేరణ మరొకటి ఉండదని నేను అనుకోను. “గత కొన్నేళ్లుగా కెరీర్‌లో హెచ్చు తగ్గులు చూశాను. నేను మళ్లీ పాత ఫామ్‌కి తిరిగి వచ్చినట్లు భావిస్తున్నాను. నేను అన్ని ఫార్మాట్‌లను ఆడుతూ ఆనందిస్తున్నాను. నేను నా జట్టు కోసం పని చేస్తున్నాను. నేను ధోనీ భాయ్ నాయకత్వంలో, తర్వాత నా కెప్టెన్సీలో ఇప్పుడు రోహిత్ భాయ్ కెప్టెన్సీలో పని చేశానన్నారు.

Read More: KCR’s Coverts: బీజేపీలో కేసీఆర్ కోవర్ట్ లు..! జాబితా రెడీ..!!