Champions Trophy: ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. భార‌త్ జ‌ట్టులోకి మ‌రో ముగ్గురు ఆట‌గాళ్లు?

భారత ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ఇంకా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా పూర్తిగా ఫిట్‌గా లేడని తేలింది.

Published By: HashtagU Telugu Desk
Champions Trophy

Champions Trophy

Champions Trophy: పాకిస్థాన్‌లో వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy) ఎట్టకేలకు టీమిండియా జట్టును ప్రకటించింది. 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును బీసీసీఐ శ‌నివారం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ జట్టు నుంచి నిష్క్రమించడం మినహా జట్టులో పెద్దగా మార్పు రాలేదు. భారత్ కోరుకుంటే ఈ జట్టులో మార్పులు కూడా చేయవచ్చు. ఎవ‌రైనా ఆటగాడు గాయ‌ప‌డితే అత‌ని స్థానంలో మ‌రో ఆట‌గాడ్ని గ్రౌండ్‌లోకి దింప‌వ‌చ్చు. ఇదే జరిగితే జట్టులో చోటు దక్కించుకోగల ముగ్గురు ఆటగాళ్ల గురించి ఒకసారి చూద్దాం.

అభిషేక్ శర్మ

పంజాబ్ కు చెందిన ఈ యువ బ్యాట్స్ మెన్ బ్యాట్ ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరఫున ఆడుతున్నప్పుడు అద్భుతంగా రాణించాడు. అతను టోర్నమెంట్‌లో 130.44 స్ట్రైక్ రేట్‌తో 467 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 170 పరుగులు. యశస్వి జైస్వాల్ ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక‌య్యాడు. కానీ అభిషేక్ శర్మను కూడా జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశం ఉంది.

Also Read: Nigeria: నైజీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 70 మంది సజీవ దహనం

హర్షిత్ రాణా

భారత ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ఇంకా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా పూర్తిగా ఫిట్‌గా లేడని తేలింది. గాయం కారణంగా బుమ్రా కొన్ని మ్యాచ్‌లు ఆడకపోతే ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్న హర్షిత్ రాణా అతని స్థానంలో మంచి ఎంపిక కాగలడని చాలా మంది న‌మ్ముతున్నారు. పింక్-బాల్ టెస్ట్‌లో అతని ప్రదర్శన ఫర్వాలేదనిపించినప్పటికీ కొత్త బంతితో అతని సత్తా అందరికీ తెలిసిందే.

నితీష్ కుమార్‌ రెడ్డి

ఆస్ట్రేలియాలో బ్యాట్‌తో పటిష్ట ప్రదర్శన చేసిన నితీష్ కుమార్‌ రెడ్డి, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా తిరిగి జట్టులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో అతను ఆడిన తీరు జ‌ట్టులో స్థానం క‌ల్పించ‌వ‌చ్చ‌ని ప‌లువురు అభిప్రాయ‌పడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అతనిని జట్టులో చేర్చుకోవడం భారతదేశానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. హార్దిక్ గాయపడితే.. నితీష్ రంగంలోకి దిగవచ్చు.

  Last Updated: 19 Jan 2025, 10:08 AM IST