Site icon HashtagU Telugu

Pandya Rumoured Girlfriend: పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ చూడ‌టానికి వ‌చ్చిన హార్దిక్ గ‌ర్ల్ ఫ్రెండ్‌!

Pandya Rumoured Girlfriend

Pandya Rumoured Girlfriend

Pandya Rumoured Girlfriend: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. అదే సమయంలో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గురించి అభిమానులు ఎక్కువ‌గా చ‌ర్చిస్తున్నారు. హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేశాడు. అయితే పాక్‌తో మ్యాచ్ చూడ‌టానికి పాండ్యా గ‌ర్ల్ ఫ్రెండ్ (Pandya Rumoured Girlfriend) కూడా వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో ఫొటోలు వైర‌ల్ చేస్తున్నారు.

స్టాండ్‌లో కనిపించిన‌ జాస్మిన్ వాలియా

మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆట చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మైదానం వెలుపల కూడా హార్దిక్ గురించి చర్చ జరుగుతోంది. బ్రిటీష్ గాయని, టెలివిజన్ వ్యక్తి జాస్మిన్ వాలియా స్టాండ్స్‌లో కనిపించింది. ఆమె హార్దిక్ పాండ్యా స్నేహితురాలు అనే రూమర్ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అక్షర్ పటేల్ భార్యతో కలిసి ఆమె ఈ మ్యాచ్‌ను వీక్షించారు.

పాండ్యా, జాస్మిన్ డేటింగ్ గురించి చర్చ కొత్త విషయం కాదు. అభిమానులు వారి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో సారూప్యతలను గమనించినప్పుడు ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇద్దరూ గ్రీస్‌లోని ఒకే హోటల్ నుండి వెకేషన్ ఫోటోలను పంచుకున్నారు. పాండ్యా, జాస్మిన్ తమ సంబంధాన్ని మాత్రం ఇంత‌వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు.

Also Read: India vs Pakistan: రాణించిన పాక్ బ్యాట్స్‌మెన్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

జాస్మిన్ వాలియా ఎవరు?

జాస్మిన్ వాలియా బ్రిటీష్ గాయని, భారతీయ మూలానికి చెందిన టెలివిజన్ న‌టి. జాక్ నైట్‌తో కలిసి ఆమె తన హిట్ ట్రాక్ బామ్ డిగ్గీతో గుర్తింపు పొందింది. ఈ పాట భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. కార్తీక్ ఆర్యన్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘సోను కే టిటు కి స్వీటీ’లో కూడా ఆమె ఓ పాట పాడింది.

భార్య‌తో పాండ్యా విడాకులు

గత సంవత్సరం న‌టి నటాసా స్టాంకోవిచ్- క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ త‌ర్వాత నుంచి పాండ్యా ఈ బ్రిటీష్ గాయ‌నితో డేటింగ్ చేస్తున్న‌ట్లు అభిమానులు నెట్టింట వైర‌ల్ చేస్తునే ఉన్నారు. అయితే ఇవాళ్టి మ్యాచ్‌కు ఆమె రావడంతో పాండ్యా- జాస్మిన్ నిజంగానే డేటింగ్ చేస్తున్నారని అభిమానులు ఎక్స్ వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు.

రోహిత్ భార్య కూడా

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మనోధైర్యాన్ని పెంచడానికి భార్య రితికా సాజెద్ కూడా దుబాయ్ చేరుకున్నారు. రోహిత్ భార్య‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. రితికాతో పాటు ఆమె 6 సంవత్సరాల కుమార్తె సమైరా శర్మ కూడా కనిపించింది.