Ravindra Jadeja: T20 ప్రపంచ కప్ 2024 ముగిసిన సమయానికి చాలా మంది ఆటగాళ్ళు T20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. వారిలో రవీంద్ర జడేజా ఒకరు. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భారత జట్టులో ఏ ఫార్మాట్‌లోనైనా రాణించగల సత్తా ఉన్న ఆటగాడు. జడేజా టెస్టు, వన్డే గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు టీ20 క్రికెట్ నుంచి రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత టీమ్ ఇండియాలో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు అన్వేషణ మొదలైంది. ఇందులో మొదటి పేరు వాషింగ్టన్ సుందర్ పేరు వస్తుంది. వాషింగ్టన్ సుందర్ గణాంకాలు కూడా మంచిగానే ఉన్నాయి.
జడేజా లేని లోటును సుందర్ భర్తీ చేయగలడా?
టాల్ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు ఇప్పటికే అద్భుతమైన టెస్టు రికార్డు ఉంది. 2021లో ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో 6 వికెట్లు తీయడమే కాకుండా సుందర్ బౌలింగ్ యావరేజ్ కూడా చాలా తక్కువ. అయితే ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సుందర్ అద్భుతంగా రాణించి జడేజా స్థానాన్ని భర్తీ చేయగలను అనే నమ్మకాన్ని సెలెక్టర్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Terrorist Attack: ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి.. జమ్మూకశ్మీర్‌లో ఘటన!
జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా పునరాగమనం చేశాడు. 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ20లోకి పునరాగమనం చేసిన సుందర్ 11 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి తన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతను జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. వారిని పరుగులు చేయకుండా ఆపడంలో సుందర్ విజయం సాధించడదానే చెప్పుకోవాలి.
అయితే రెండో ఇన్నింగ్స్‌లో అసలు అద్భుతం జరిగింది. భారత్ 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి ఓటమి అంచున చేరింది. కానీ సుందర్ పట్టు వదలకుండా ఒంటిచేత్తో మ్యాచ్ గెలవాలని ప్రయత్నించాడు. అతను 35 పరుగులతో పోరాట ఇన్నింగ్స్ ఆడాడు. కానీ భారత్‌ను విజయపథంలో నడిపించలేకపోయాడు. టీ20లో రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయం కాగలడని సుందర్ ఆటతీరు నిరూపించింది. జడేజా రిటైర్మెంట్ తర్వాత అతని స్థానంలో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో సహకారం అందించగల ఆటగాడి కోసం బీసీసీఐ వెతుకుతోంది. సుందర్ రెండు రంగాల్లోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. మరీ సెలెక్టర్లు ఏం చేస్తారో చూడాలి.
We’re now on WhatsApp : Click to Join