Site icon HashtagU Telugu

Kavya: కావ్య పాపకు కోపం తెప్పించిన కెమెరామెన్

Cameraman Who Made Kavya Papa Angry

Cameraman Who Made Kavya Papa Angry

Kavya : సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కో-ఓనర్ కావ్య మారన్ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడేమో. మొత్తం ఐపీయల్ టోర్నీ చూసుకున్నా.. కావ్య పాపా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అందం, అభినయంతో పాటు వాలుకనులతో యువతను కట్టిపడేస్తుంది. పిన్న వయసులో ఒక ఫ్రాంచైజీకి కో ఓనర్ అవ్వడమే కాకుండా తన జట్టు విజయానికి తన సపోర్ట్ చాలానే ఉంటుంది. తమిళనాడుకు చెందిన కావ్య ప్రస్తుతం క్రెకెట్ అభిమానులకు నేషనల్ క్రష్ గా మారిపోయింది.

అయితే ఈ అమ్మడు తన జట్టు కష్టకాలంలో ఉంటే తనని కొంచెం డిస్ట్రబ్ చేసినా సహించదు. అలాగే తన జట్టు ఆటగాళ్లు ఫోర్ కొట్టినా, సిక్సర్ బాదినా అమ్మడు ఆనందం మాములుగా ఉండదు. కానీ ఈ రోజు తన జట్టు గెలిచినప్పటికీ ఓ విషయంలో తీవ్రంగా ఫైర్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో శిఖర్ ధావన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లకు చుక్కలు చూపించి 99 పరుగులతో మైదానంలో చెలరేగిపోయాడు. 66 బంతుల్లో 99 పరుగులు చేసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఇక సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్ ను చూస్తున్న కావ్య మారన్ మొహం పేలిపోయింది. ధావన్ ఒక్కో బంతిని చెడుగుడు ఆడుతుంటే అమ్మడు నిరాశకు గురైంది. చాలా చిరాకుగా ఉన్న సమయంలో కెమెరామెన్ కెమెరాని కావ్య (Kavya) వైపుకి తిప్పాడు. దాంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చిన్నట్టుంది. చల్ హాట్ రే అంటూ మండిపడింది. అది కూడా అమ్మడు స్టయిల్ లో అన్నది. ఇంకేముంది దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ క్లిప్ చక్కర్లు కొడుతోంది.

ఈ రోజు ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ జట్లు తలపడ్డాయి. రెండు మ్యాచుల్లో ఓటమితో వెనుకంజలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఐపీఎల్ 2023 లో గెలుపు బోణీ కొట్టింది. 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ 17.1 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 145 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. రాహుల్ త్రిపాఠి వన్ డౌన్ లో వచ్చి పంజాబ్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు.

48 బంతుల్లో 74 నాటౌట్ గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 21 బంతుల్లో 37 నాటౌట్ గా నిలిచి 6 ఫోర్లతో చెలరేగిపోయాడు. సన్ రైజర్స్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే… కెప్టెన్ శిఖర్ ధావన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 66 బంతుల్లో 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.12 ఫోర్లు, 5 సిక్సర్లతో వీరోచిత పోరాటం చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ 1, రాహుల్ చహర్ 1 వికెట్ తీశారు.

Also Read:  Jagan & KCR on Vizag Steel: విశాఖ స్టీల్ పై జగన్, కేసీఆర్ వ్యూహం! నెక్స్ట్ మచిలీపట్నం ఓడరేవు!

Exit mobile version