India Playing XI: ఐర్లాండ్ మూడో మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్

ఐర్లాండ్ గడ్డపై టీమిండియా అదరగొడుతుంది. మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ రెండు మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఆగష్టు 23న టీమిండియా ఐర్లాండ్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగనుంది.

India Playing XI: ఐర్లాండ్ గడ్డపై టీమిండియా అదరగొడుతుంది. మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ రెండు మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఆగష్టు 23న టీమిండియా ఐర్లాండ్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో భారీ మార్పులు జరగనున్నట్టు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. బెంచ్ ఆటగాళ్లందరికి ఆ మ్యాచ్ లో చోటు దక్కనుంది. కెప్టెన్ జస్‌‌ప్రీత్ బుమ్రాతో పాటు ప్రసిద్ కృష్ణ, సంజూ శాంసన్ మూడో టీ20 మ్యాచ్ లో కనిపించకపోవచ్చు.

సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. అసాధారణ బౌలింగ్ తో ఐర్లాండ్ బ్యాటర్లను వణికించేశాడు. ఆడిన రెండు మ్యాచ్ లో నాలుగు బలమైన వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు. మూడో మ్యాచ్ లో బుమ్రాని ఆడించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే మూడో మ్యాచ్ గెలిచినా ఓడినా పెద్దగా నష్టం లేదు. కాబట్టి ఆసియ కప్ కి ముందు బుమ్రాకి రెస్ట్ అవసరమని బీసీసీఐ భావిస్తుంది.

బుమ్రా ని రుతురాజ్ గైక్వాడ్ రీప్లేస్ చేయనున్నాడు. సంజూ శాంసన్ స్థానంలో జితేశ్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనుండగా.. ముకేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ తుది జట్టులోకి రానున్నారు. రింకూ సింగ్, తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబే యధావిధంగా కొనసాగుతారు.

అంచనా ప్రకారం భారత తుది జట్టు: కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ , యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్

Also Read: Korean Beauty Tips: కొరియన్స్ అంత అందంగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?