Site icon HashtagU Telugu

British Swimmer: పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్‌.. మ‌రుస‌టి రోజే కరోనా పాజిటివ్‌..!

British Swimmer

British Swimmer

British Swimmer: పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుండి ప్రారంభమైంది. అయితే చాలా ఆటలు రెండు రోజుల ముందు అంటే జూలై 24 నుండి ప్రారంభమయ్యాయి. అధికారిక ప్రారంభ వేడుక జూలై 26న జరిగింది. పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలను అభిమానులు ఆస్వాదిస్తున్నారు. అయితే కరోనా కూడా పారిస్ ఒలింపిక్స్‌లోకి ప్రవేశించింది. కరోనా ఇంగ్లీష్ అథ్లెట్‌ (British Swimmer)కు సోకింది.

బ్రిటిష్ స్విమ్మర్ ఆడమ్ పీటీకి కరోనా సోకింది. జూలై 28న 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఆడమ్ పతకం సాధించాడు. 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఫైనల్‌లో పాల్గొన్న ఆడమ్ PT ర‌జ‌త పతకం గెలిచిన మరుసటి రోజే అతనికి కరోనా పాజిటివ్ అని వార్తలు వచ్చాయి. ఈ ఈవెంట్‌లో నికోలో మార్టినెంగీ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది కాకుండా ఆడమ్‌కు అమెరికన్ స్విమ్మర్ నిక్ ఫింక్‌తో కూడా పరిచయం ఏర్పడింది. దీంతో అత‌నికి కూడా ప‌రీక్ష‌లు నిర్వహించాల్సి ఉంది.

Also Read: Manika Batra: పారిస్‌ ఒలింపిక్స్‌లో చ‌రిత్ర సృష్టించిన మనికా బాత్రా.. ఎవ‌రు ఈమె..?

ఆదివారం (జూలై 28) ఉదయం ఆడమ్ పిటికి ఆరోగ్యం బాగాలేదని ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ అతను ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఫైనల్ ఆడిన తర్వాత ఆడమ్ ఆరోగ్యం క్షీణించింది. అనంత‌రం పరీక్షించినప్పుడు అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో కోవిడ్-19కి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. గతంలో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో కోవిడ్-19 విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. టోక్యో ఒలింపిక్స్‌లో అన్ని ఈవెంట్‌లు అభిమానులు లేకుండానే జరిగాయి. పారిస్ ఒలింపిక్స్‌లో కోవిడ్-19 బారిన పడిన ఆడమ్ పిటి కూడా టోక్యో ఒలింపిక్స్‌లో భాగమయ్యాడు, అక్కడ అతను అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆడమ్ టోక్యో ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు సహా 4 పతకాలు సాధించాడు.

We’re now on WhatsApp. Click to Join.

పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌ ప్రదర్శన

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఒక పతకం రావడం గమనార్హం. షూటర్ మను భాకర్ భారత్‌కు కాంస్య ప‌త‌కాన్ని సాధించింది. ఇక భారత్‌కు తదుపరి పతకం ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.