Border-Gavaskar Trophy: ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) శుక్రవారం నుంచి అంటే నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమ్ ఇండియా తన సన్నాహాల్లో బిజీగా ఉంది. పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ గురించి పెద్ద వార్త బయటకు వచ్చింది. పెర్త్‌లో ఇండియా ఎతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ గాయపడినట్లు సమాచారం.
మీడియా నివేదికల ప్రకారం.. గిల్ చేతి వేళ్లకు గాయాలయ్యాయి. అతను స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ గాయానికి గురయ్యాడు. గాయం నయం అయితే నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో గిల్ ఆడడం ఖాయమే. ఒక వేళ నయం కాకుంటే గిల్ రెండో టెస్టు నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గిల్ భారత జట్టులో ముఖ్యమైన సభ్యుడు. అతని గాయం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్ స్థానాన్ని మారుస్తుంది. ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో గిల్ గాయపడటం టీమిండియాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Red Wine Fight Cancer: రెడ్ వైన్ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక గిల్ గాయాన్ని ధృవీకరించింది. అయితే పెర్త్‌లో ప్రారంభ టెస్ట్‌కు గిల్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. శుబ్‌మాన్ గిల్ గాయపడ్డాడని, అయితే అతడిని మొదటి టెస్టు నుండి తప్పించడం చాలా తొందరగా ఉంటుందని, వైద్య బృందం అతనిని నిశితంగా పరిశీలిస్తోందని నివేదిక రాసుకొచ్చింది. గిల్ గాయానికి ముందు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కూడా గాయపడ్డారు. అయితే కోహ్లీ ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లి ఫిట్‌గా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ సిమ్యులేషన్‌లో ఎలాంటి సమస్య లేకుండా బ్యాటింగ్ చేశాడు.
భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ షెడ్యూల్
- తొలి టెస్టు: నవంబర్ 22 నుంచి 26 వరకు
- రెండో టెస్టు: డిసెంబర్ 6 నుంచి 10 వరకు
- మూడో టెస్టు: డిసెంబర్ 14 నుంచి 18 వరకు
- నాల్గవ టెస్ట్: 26 నుండి 30 డిసెంబర్
- ఐదవ టెస్టు: జనవరి 3 నుంచి 7 వరకు