Prithvi Shaw: టీమిండియా క్రికెటర్ కు షాక్.. పృథ్వీ షాకు నోటీసులు జారీ చేసిన బాంబే హైకోర్టు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పరుగులు సాధించాలని తహతహలాడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw). కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్‌ (Sapna Gill)తో సెల్ఫీ వివాదం కొత్త మలుపు తిరిగింది.

  • Written By:
  • Publish Date - April 15, 2023 / 06:44 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పరుగులు సాధించాలని తహతహలాడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw). కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్‌ (Sapna Gill)తో సెల్ఫీ వివాదం కొత్త మలుపు తిరిగింది. పృథ్వీ షా సహా 11 మందికి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో విధులు సక్రమంగా నిర్వహించలేకపోయిన ఇద్దరు పోలీసులకు హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది.

అసలేం జరిగింది..?

ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రికెటర్ పృథ్వీ షా తన స్నేహితులతో కలిసి డిన్నర్ కోసం ముంబైలోని ఒక హోటల్‌కు వెళ్లాడు, ఆ తర్వాత అక్కడ సెల్ఫీ తీసుకున్నందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పృథ్వీ షా మాట్లాడుతూ.. ఫొటో తీయడానికి నిరాకరించినందుకు సప్నా, ఆమె స్నేహితులు తనను కొట్టారని చెప్పారు. వీడియోలో పృథ్వీ షా కారు కూడా డ్యామేజ్ అయింది. ఆ తర్వాత పోలీసులు సప్నా గిల్, ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు.

బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఎస్‌బి శుక్రే, ఎంఎస్ సాఠేలతో కూడిన డివిజన్ బెంచ్ ఇటివల పృథ్వీ షాతో పాటు 11 మందికి నోటీసులు జారీ చేసింది. నిజానికి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై సప్నా గిల్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందులో పృథ్వీ షాపై వేధింపులకు పాల్పడ్డారని, బ్యాట్‌తో కొట్టారని ఆరోపించారు. ఆ పిటిషన్ ఆధారంగా పృథ్వీ షాతో పాటు 11 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్‌లో ఈ అంశంపై విచారణ జరగనుంది.

Also Read: Harry Brook: సెంచరీతో విమర్శకులకు జవాబిచ్చిన బ్రూక్

తమపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ గిల్ చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఎస్‌బి శుక్రే, ఎంఎం సాఠేలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం పోలీసులకు, షాకు నోటీసులు జారీ చేసి జూన్‌కు వాయిదా వేసింది. ముంబైకి చెందిన క్రికెటర్‌తో పోలీసులు చేతులు కలిపి సప్నా గిల్‌పై తప్పుడు కేసు నమోదు చేశారని గిల్ తరపు న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ ధర్మాసనానికి తెలిపారు. గొడవ జరగడానికి ముందు అసలు ఏం జరిగిందో చూపించడానికి అంధేరిలోని హోటల్ లోపల ఉన్న CCTV ఫుటేజీని పొంది భద్రపరచమని అలీ కాషిఫ్ ఖాన్ పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఈ కేసులో తనపై చార్జిషీటు దాఖలు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా గిల్ పిటిషన్‌లో కోరారు.