Best Opening Pairs: ఐపీఎల్ కి సమయం దగ్గరపడుతోంది. అన్ని జట్ల తమ ఓపెనింగ్ జోడిపై దృష్టి పెట్టాయి. కొన్ని ఫ్రాంచైజీలు కొత్తవారిని ఓపెనింగ్ కు పంపాలని నిర్ణయించగా, స్టార్ ఫ్రాంచైజీలు మాత్రం సీనియర్లతోనే ఇన్నింగ్స్ ప్రారంబించాలనుకుంటున్నారు. కాగా వచ్చే సీజన్లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ల (Best Opening Pairs) గురించి తెలుసుకుందాం.
ధనాధన్ లీగ్ ఐపీఎల్ లో బ్యాటర్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. బౌలర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా బ్యాటర్లు మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తుంటారు. పవర్ ప్లేలో బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు చేతులెత్తేయాల్సిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ జోడీ ఐపీఎల్ లోనే బెస్ట్ ఓపెనింగ్ జోడిగా భావిస్తారు. ట్రావిస్ హెడ్ ,అభిషేక్ శర్మ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తే భారీ ఆరంభం లభిస్తుంది. గతంలో వీరిద్దరూ ఎన్నోసార్లు బలమైన ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లుగా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. వచ్చే సీజన్ కోసం ఫ్రాంచైజీ ఈ ఓపెనర్లిద్దరినీ నిలుపుకుంది. మరోసారి ఈ జంట ఓపెనింగ్ కు దిగనుంది. వేలానికి ముందు తమ ఓపెనింగ్ జోడీని నిలబెట్టుకున్న జట్లలో రాజస్థాన్ రాయల్స్ కూడా ఉంది. యశస్వి జైస్వాల్ ,సంజు శాంసన్ రూపంలో ఆర్ఆర్ కు బలమైన ఓపెనర్లున్నారు. వచ్చే సీజన్లోనూ ఈ ఇద్దరు జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సంజు టి20 స్పెషలిస్టుగా రాణిస్తున్నాడు.
Also Read: Rohit Sharma: ఆ భయంతోనే రోహిత్ రంజీ ఆడాడా..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో విరాట్ కోహ్లీ వంటి ప్రమాదకరమైన మరియు అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ ఉన్నాడు, విరాట్ ఓపెనర్ గా ఎలాంటి బౌలర్‌నైనా ఈజీగా ఎదుర్కొంటాడు. ఇప్పుడు ఆర్సీబీ ఫిల్ సాల్ట్‌ను కూడా కొనుగోలు చేసింది. విరాట్ మరియు ఫిల్ సాల్ట్ జంట రాబోయే సీజన్‌లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీలలో ఒకటిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు టి20 ఫార్మెట్లో అద్భుత రికార్డుల్ని నమోదు చేశారు.