బెన్ స్టోక్స్ (Ben Stokes) గాయంపై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ ఇంగ్లిష్ ఆటగాడు మరోసారి గాయపడ్డాడని, దాని కారణంగా అతను ఒక వారం పాటు ఆటకు దూరంగా ఉంటాడని ఫ్లెమింగ్ చెప్పాడు. అయితే, ఈ గాయం తీవ్రమైనది కాదని, స్టోక్స్ కోలుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడని కూడా చెప్పాడు. IPL 2023 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 16.25 కోట్లు వెచ్చించి బెన్ స్టోక్స్‌ను తమ జట్టులో చేర్చుకుంది. సీజన్-16లో CSK ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా, స్టోక్స్ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే పాల్గొనగలిగాడు. గాయం కారణంగా అతను నాలుగు మ్యాచ్‌లకు జట్టుకు దూరమయ్యాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత బెన్ స్టోక్స్ గాయం గురించి ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘బెన్ స్టోక్స్ మళ్లీ గాయపడ్డాడు. ఆటకు ఒక వారం పాటు దూరంగా ఉంటాడు. దాని గురించి నాకు పెద్దగా తెలియదు కానీ అది పెద్ద గాయం కాదు. అతను కోలుకునే దశలో ఉన్నాడు. దాని కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇది అతని తప్పు కాదు, అతనికి కొంచెం అదృష్టం కావాలన్నారు.
Also Read: MI vs PBKS: ఐపీఎల్ లో నేడు మరో రసవత్తర మ్యాచ్.. ముంబై జోరుకి పంజాబ్ బ్రేక్ వేస్తుందా..?
ఇది కాకుండా ధోనీ గాయం గురించి CSK కోచ్ కూడా అప్‌డేట్ ఇచ్చాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సమయంలో ధోనీ మోకాలికి గాయమైంది. టోర్నీలో అతను చాలాసార్లు గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. అయితే, ధోనీ పూర్తిగా క్షేమంగా ఉన్నాడని ఫ్లెమింగ్ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ తో ఏప్రిల్ 23న అంటే రేపు ఆడాల్సి ఉంది.