Ben Duckett: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 22న ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున బెన్ డకెట్ (Ben Duckett) అద్భుత ప్రదర్శన చేశాడు. సెంచరీ ఆడి గొప్ప ఘనత సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తరఫున అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ప్లేయర్‌గా ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
డకెట్ రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా బెన్ డకెట్ నిలిచాడు. 2017లో ఓవల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడిన జో రూట్ రికార్డును డకెట్ బద్ధలుకొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో డకెట్ 165 పరుగులతో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ మాత్రమే కాదు.. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో డకెట్ ఇన్నింగ్స్ 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 165 పరుగులు చేశాడు.
Also Read: Toothpaste: ఏ వయస్సులో పిల్లలు టూత్‌పేస్ట్ వాడాలి?
సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలైంది
డకెట్ కంటే ముందు ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియాపై అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 1998 సంవత్సరంలో 141 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇప్పుడు డకెట్ మాస్టర్ బ్లాస్టర్ రికార్డును కూడా వెనక్కినెట్టాడు.
ఇంగ్లండ్ పటిష్ట బ్యాటింగ్ చూసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 7 మంది బౌలర్లను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. బెన్ ద్వార్షుయిస్ 10 ఓవర్లలో 66 పరుగులిచ్చి గరిష్టంగా 3 వికెట్లు తీసి జట్టులో అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు. ఆడమ్ జంపా, మార్నస్ లాబుషాగ్నే చెరో రెండు వికెట్లు తీయగా.. గ్లెన్ మాక్స్‌వెల్ కూడా ఒక వికెట్ తీశారు. నాథన్ ఎల్లిస్ తప్ప ఆస్ట్రేలియా బౌలర్లందరూ 6 కంటే ఎక్కువ ఎకానమీ రేట్‌తో పరుగులు ఇచ్చారు.