Dot Balls: ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. మంగళవారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో హార్దిక్ జట్టు ధోనీ సేన చేతిలో ఓడిపోయింది. CSK ఇప్పుడు IPL 2023 ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీవీ స్క్రీన్‌పై స్కోర్‌బోర్డ్‌ను చూసి అందరి కళ్ళు ఆశ్చర్యపోయాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతి డాట్ బాల్ (Dot Balls)లో ‘0’కి బదులుగా ఒక చెట్టు టీవీలో కనిపించింది. దీనిపై అనేక రకాల ప్రశ్నలు ప్రజల మదిలో మెదిలినప్పటికీ సమాధానం దొరకలేదు. ఇది BCCI అద్భుతమైన చొరవలో భాగమని తరువాత తెలిసింది.
వాస్తవానికి మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్క్రీన్‌పై డాట్ బాల్స్‌కు బదులుగా చెట్లను బ్రాడ్‌కాస్టర్ చూపారు. అప్పటి నుంచి క్వాలిఫయర్స్‌లో డాట్ బాల్స్‌కు బదులు చెట్లు ఎందుకు కనిపిస్తున్నాయన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. డాట్ బాల్స్ కాకుండా చెట్లు కనిపించడం వెనుక పెద్ద కారణమే ఉంది. చెట్లకు సంబంధించి బిసిసిఐ ఒక ముఖ్యమైన చొరవ తీసుకుంది. దీని కారణంగా బీసీసీఐ బోర్డు అభిమానులచే ప్రశంసించబడుతోంది.
Also Read: Wrestlers Protest: రెజ్లర్ల నిరసన.. మే 28న కొత్త పార్లమెంట్ భవనం వద్ద ‘మహిళా మహా పంచాయత్’..!
ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ మ్యాచ్‌లో వేసిన ప్రతి డాట్ బాల్‌కు 500 చెట్లను నాటాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ కారణంగా టీవీ తెరపై ప్రతి డాట్ బాల్‌కు బదులుగా చెట్లు కనిపించాయి. పర్యావరణం దృష్ట్యా ఇది ముఖ్యమైన నిర్ణయం కాబట్టి బీసీసీఐ ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో చాలా ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే మంగళవారం జరిగిన గుజరాత్- చెన్నై క్వాలిఫయర్-1 మ్యాచ్ లో మొత్తం 84 డాట్ బాల్స్ నమోదు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా బీసీసీఐ 42,000 మొక్కలు నాటనుంది. బీసీసీఐ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
ప్లేఆఫ్ తొలి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. గుజరాత్ వర్సెస్ చెన్నై మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. చెన్నై తరఫున గైక్వాడ్ అత్యధికంగా 60 పరుగులు చేయగా, డెవాన్ కాన్వే 40 పరుగులు చేశాడు. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మెన్ చెన్నై బౌలింగ్ ముందు తేలిపోయారు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు 157 పరుగులు మాత్రమే చేసింది.