BCCI: టీమిండియా కొత్త టైటిల్ స్పాన్సర్షిప్ ఐడీఎఫ్‌సీ

ఐడీఎఫ్ సీ బీసీసీఐతో డీల్ కుదిర్చుకుంది. టీమిండియా కొత్త టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ఐడీఎఫ్సీ బ్యాంక్ దక్కించుకుంది

Published By: HashtagU Telugu Desk
BCCI

New Web Story Copy (91)

BCCI: ఐడీఎఫ్ సీ బీసీసీఐతో డీల్ కుదిర్చుకుంది. టీమిండియా కొత్త టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ఐడీఎఫ్సీ బ్యాంక్ దక్కించుకుంది. ఇకనుంచి టీమిండియా ఆడే ప్రతీ అంతర్జాతీయ మ్యాచులతోపాటు డొమిస్టిక్‌ సిరీస్‌ టైటిల్లకు స్పాన్సర్‌ గా ఐడీఎఫ్‌సీ వ్యవహరిస్తుంది. బీసీసీఐ నిర్వహించే ఇరానీ, దులీప్‌, రంజీ ట్రోఫీలతోపాటు భారత పురుష, మహిళా జట్లు ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లకు ఐడీఎఫ్సీ స్పాన్సర్ చేయనుంది.

ఐడీఎఫ్సీ ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కు బీసీసీఐకి 4 కోట్లపైగానే చెల్లిస్తుంది. స్వదేశంలో రాబోయే మూడేళ్లలో మొత్తం 56 అంతర్జాతీయ మ్యాచ్ లు జరగుతాయి. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ తో బీసీసీఐతో ఐడీఎఫ్‌సీ స్పాన్సర్షిప్ మొదలవుతుంది. 2026 ఆగస్టు వరకు ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఇంతకుముందు 2022 వరకు బిసిసిఐ టైటిల్స్ స్పాన్సర్ గా పేటీఎం ఉండేది. ఆ తర్వాత మాస్టర్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్ కార్డ్ ఒక్కో మ్యాచ్ కు 3 కోట్ల 80 లక్షలు బీసీసీఐకి చెల్లించింది.

Also Read: ISRO vs SUPARCO: ఇండియా ఇస్రో వర్సెస్ పాక్ సుపార్కో

  Last Updated: 26 Aug 2023, 07:05 PM IST