BCCI Meeting With Rohit: భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఉత్కంఠగా కొనసాగుతోంది. నాలుగు మ్యాచ్‌ల తర్వాత టీమిండియా 1-2తో సిరీస్‌లో వెనుకంజలో ఉంది. ఈ మొత్తం సిరీస్‌లో సీనియర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు భారీ స్కోరు సాధిస్తారని అంచనా వేసినా అది జరగలేదు. జట్టు ఇప్పుడు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తోందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో రోహిత్, కోహ్లీపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విరాట్-రోహిత్ మాత్రమే కాదు.. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ పాత్రపై (BCCI Meeting With Rohit) కూడా ప్రశ్నల వర్షం కురుస్తోంది.
అయితే సిడ్నీ ఐదో టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్, గంభీర్‌లతో బీసీసీఐ సమావేశం నిర్వహించవచ్చని తెలుస్తోంది. భారత జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా చేరుకున్నట్లు కూడా చెబుతున్నారు. కెప్టెన్సీ, రిటైర్‌మెంట్‌కు సంబంధించి రోహిత్- అగార్కర్‌కు మధ్య చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్‌పై 6 ఇన్నింగ్స్‌లలో 91 పరుగులు మాత్రమే చేశాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో 42 పరుగులు సాధించాడు. గత 15 ఇన్నింగ్స్‌లలో అతని టెస్ట్ పరుగుల సంఖ్య 164 మాత్రమే. ఇందులో రోహిత్ సగటు 11 కంటే తక్కువ.
Also Read: Game Changer Trailer: గేమ్ ఛేంజర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్..!
తాజాగా క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ సిరీస్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్‌తో చర్చలు ఉండవచ్చు. చీఫ్ సెలక్టర్ ఆస్ట్రేలియాలో ఉండి గంభీర్, రోహిత్‌లతో మాట్లాడినప్పటికీ అతను సిరీస్ మధ్యలో ఎటువంటి నిర్ణయానికి రాలేడని నివేదిక స్పష్టం చేసింది. రోహిత్ కావాలంటే సిడ్నీ టెస్టు మ్యాచ్‌కు దూరంగా ఉండొచ్చు. అయితే దీని పరిధి తక్కువ. జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న చివరి టెస్టు మ్యాచ్‌లో అతను జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. తాను ఇంకా రిటైర్మెంట్ తీసుకోలేదని నాలుగో టెస్టు మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో చెప్పాడు.
కాగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన ప్రస్థానం ప్రారంభం నుంచి భారత్‌కు ఓటమిపై ఓటమి ఎదురవుతోంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ అయినా లేదా స్వదేశంలో న్యూజిలాండ్‌పై క్లీన్‌స్వీప్ అయినా ఇప్పుడు BGTలో 2-1తో వెనుకబడి ఉన్నా ఈ జోడీ మంచిగా పని చేయడం లేదని నిరూపిస్తోంది. మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన అశ్విన్ BGT మధ్యలో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. BGT బృందంలో కొన్ని ఆశ్చర్యకరమైన ఎంపికలు కూడా కనిపించాయి. MCG టెస్ట్ గురించి మాట్లాడుకుంటే.. మేనేజ్‌మెంట్ 11 మందిలో గిల్‌ను ఉంచింది. ముగ్గురు ఆల్ రౌండర్‌లను ఎంపిక చేసింది. అశ్విన్ రిటైర్మెంట్‌లో గంభీర్ పాత్ర ఉండకపోవచ్చు.. కానీ సిరీస్‌లో తీసుకున్న నిర్ణయాలకు అతను సమాధానం చెప్పాల్సి ఉంటుంది.