Site icon HashtagU Telugu

Impact Player Rule: ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌పై కీల‌క నిర్ణ‌యం.. వ‌చ్చే ఏడాది డౌటే..?

IPL 2024 Tickets

Ipl 2024

Impact Player Rule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాతి సీజన్ అంటే IPL 2025లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని (Impact Player Rule) రద్దు చేసే అవ‌కాశం ఉంది. గత సీజన్‌ ఐపీఎల్‌లో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రస్తుత సీజన్‌లో చాలా ఎక్కువ స్కోరింగ్ మ్యాచ్‌ల తర్వాత ఈ నియమం ప్రశ్నార్థకంగా మారింది. రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా దీనిపై ప్రశ్నలు సంధించారు. ఈ నిబంధన బౌలర్లపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పలువురు నిపుణులు కూడా చెబుతున్నారు.

తదుపరి ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండ‌దా?

ఐపీఎల్ 2024లో జట్లు 8 సార్లు 250 మార్కును దాటాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో ప్లేయింగ్ XIలో అదనపు ఆటగాడిని చేర్చుకునే అవకాశం జట్లకు లభిస్తోంది. దీని కారణంగా బ్యాట్స్‌మెన్ ఎటువంటి భయం లేకుండా ఆడుతున్నారు. బౌలర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిబంధనను తొలగించడంపై చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేశామని, వాటాదారులందరూ కోరుకుంటే దానిని పునరాలోచించవచ్చని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు.

Also Read: Sri Lanka squad: టీ20 ప్ర‌పంచ క‌ప్‌కు కొత్త కెప్టెన్‌తో బ‌రిలోకి దిగుతున్న శ్రీలంక‌..!

శుక్రవారం జై షా మీడియాతో మాట్లాడుతూ.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేశామని.. అయితే ఇది ఇద్దరు భారత ఆటగాళ్లకు అదనంగా ఆడేందుకు అవకాశం కల్పిస్తోందని.. ఇది ముఖ్యం కదా.. క్రీడలతో పాటు పోటీ కూడా అని జే షా అన్నారు. ఇది సరికాదని ఆటగాళ్లు భావిస్తే ఐపీఎల్, ప్రపంచకప్ తర్వాత మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపాడు.

Also Read: Pista Side Effects: పిస్తా పప్పు ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ త‌ప్ప‌వు..!

‘ఇంపాక్ట్ ప్లేయర్ నియమం శాశ్వతం కాదు’

ఇంపాక్ట్ ప్లేయర్ నియమం శాశ్వతం కాదని జై షా అన్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత దాని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. ప్రపంచకప్ తర్వాత ఆటగాళ్లు, జట్లు, బ్రాడ్‌కాస్టర్లతో సమావేశమై భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సెక్రటరీ అన్నారు. ఇది శాశ్వత నిబంధన కాదు, రద్దు చేస్తామని కూడా చెప్పడం లేదని పేర్కొన్నారు.

We’re now on WhatsApp : Click to Join