BCCI: త్వరలో టీమిండియా సొంత గడ్డపై ఆడాల్సిన మ్యాచ్ లు, జట్లు, వేదికల తదితర వివరాలను బీసీసీఐ తెలిపింది. సొంతగడ్డపై టీమిండియా మూడు దేశాల ఆటగాళ్లకు ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ మేరకు 2023-2024 టీమిండియా షెడ్యూల్ ని విడుదల చేసింది.
టీమిండియా 5 టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడబోతుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ దేశాల జట్లు ఈ మేరకు భారత్ లో పర్యటించనున్నాయి. ముందుగా ఆస్ట్రేలియా భారత్‌లో ఢీకొట్టనుంది. మూడు వన్డేల్లో కంగారు జట్టు భారత్ తలపడనున్నాయి. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 22న, రెండో మ్యాచ్ 24న, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 27న జరగనుంది. ప్రపంచ కప్ తర్వాత ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో కూడా భారత జట్టుతో తలపడుతుంది, ఇది నవంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ డిసెంబర్ 3న జరుగుతుంది.
2024 ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్ లో పర్యటించనుంది. భారత్‌తో మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడనుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 11న మొహాలీలో జరగనుండగా, చివరి మ్యాచ్‌కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో, ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ రాంచీలో జరుగుతుంది. ఇక సిరీస్‌లోని చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.
Also Read: Warts: పులిపురి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?