Site icon HashtagU Telugu

Women’s Premier League 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

WPL

Resizeimagesize (1280 X 720)

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) షెడ్యూల్‌ ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 4 నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. తొలిసీజన్‌లో 20 లీగ్ మ్యాచులు, 2 ప్లే ఆఫ్ మ్యాచులు జరుగుతాయి. మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడతాయి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (WPL) తొలి ఎడిషన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు (BCCI) ప్రకటించింది. లీగ్‌లోని మొదటి మ్యాచ్ మార్చి 4వ తేదీన ముంబై- గుజరాత్‌ల మధ్య జరగనుంది. దేశంలో జరగనున్న తొలి మహిళల ప్రీమియర్ లీగ్ కోసం సోమవారం 87 మంది క్రీడాకారిణులను వేలం వేశారు.

మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ షెడ్యూల్

WPL 2023 మొదటి సీజన్‌లో 22 మ్యాచ్‌లు ఆడతారు. 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో లీగ్ రౌండ్‌లో 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతోపాటు ఎలిమినేటర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 24న డివై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. WPL 2023 చివరి మ్యాచ్ మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లను బ్రబౌర్న్ స్టేడియం, డివై పాటిల్ క్రికెట్ అకాడమీ నిర్వహిస్తాయి.

Also Read: Richa Ghosh: మా అమ్మానాన్నలకు ఇల్లు కొనిస్తా: రిచా ఘోష్

లీగ్ రౌండ్‌లో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా ఆడనున్నారు. అంటే ఒక్కరోజులో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. డబుల్ హెడర్ రోజున, మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కాగా, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో ఐదు జట్లు పాల్గొంటాయి. ఇందులో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ ఉన్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి ముగ్గురు భారతీయ ఆటగాళ్లలో స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్ ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో యాష్లే గార్డనర్, నాట్ స్కివర్-బ్రంట్, బెత్ మూనీ ఉన్నారు.