Babar Azam’s World XI: బాబ‌ర్ ఆజం టీ20 వ‌ర‌ల్డ్ జ‌ట్టు ఇదే.. కోహ్లీ, బుమ్రాల‌కు షాక్‌!

ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తన T20 వరల్డ్-11 జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో బాబర్ కేవలం ఇద్దరు భారతీయ ఆటగాళ్లను మాత్రమే ఎంచుకున్నాడు. బాబర్ తన జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, లేదా తనను తాను కూడా చేర్చుకోలేదు.

Published By: HashtagU Telugu Desk
Babar Azam's World XI

Babar Azam's World XI

Babar Azam’s World XI: ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తన T20 వరల్డ్-11 (Babar Azam’s World XI) జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో బాబర్ కేవలం ఇద్దరు భారతీయ ఆటగాళ్లను మాత్రమే ఎంచుకున్నాడు. బాబర్ తన జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, లేదా తనను తాను కూడా చేర్చుకోలేదు. ఒక పాడ్‌కాస్ట్ సందర్భంగా బాబర్ తన T20 వరల్డ్-11 జట్టును ఎంపిక చేశాడు. బాబర్ మంచి జట్టును ఎంచుకున్నప్పటికీ కోహ్లీ, బుమ్రాను ఎంచుకోకపోవడం కొంత ఆశ్చర్యకరంగా ఉంది.

ఈ ఇద్దరు భారతీయ ఆటగాళ్లను ఎంచుకున్నాడు

బాబర్ ఆజం తన T20 వరల్డ్-11 జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను ఎంచుకున్నాడు. రోహిత్‌ను బాబర్ మొహమ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఓపెనింగ్‌లో ఉంచాడు. అలాగ సూర్యకుమార్ యాదవ్‌ను నంబర్-4 స్థానంలో బ్యాటింగ్ కోసం ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ పేరిట T20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు (4231 పరుగులు) చేసిన రికార్డు ఉంది. T20 ప్ర‌పంచ క‌ప్ 2024 గెలిచిన తర్వాత రోహిత్ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు.

నంబర్-3 స్థానంలో బాబర్ పాకిస్తాన్ ఆటగాడు ఫఖర్ జమాన్‌ను చేర్చాడు. అలాగే నంబర్-5లో ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్, నంబర్-6లో దక్షిణాఫ్రికా శక్తిమంతమైన బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్, నంబర్-7లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సెన్‌ను ఎంచుకున్నాడు. స్పిన్ బౌలర్‌గా బాబర్.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌ను ఎంచుకున్నాడు. అలాగే ఫాస్ట్ బౌలర్లుగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ ఆటగాడు మార్క్ వుడ్‌లను చేర్చాడు.

Also Read: Health Tips: హై బీపీతో బాధపడుతున్నారా? మందులు లేకుండా కంట్రోల్ చేసుకునే టిప్స్ చెప్పారు బాబా రాందేవ్

బాబర్ ఆజం T20 వరల్డ్-11

రోహిత్ శర్మ, మొహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, రషీద్ ఖాన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మరియు మార్క్ వుడ్.

  Last Updated: 17 May 2025, 04:16 PM IST