Site icon HashtagU Telugu

Babar Azam Clean-Bowled: బాబర్ ఆజం పరువు తీసిన లోకల్ బౌలర్

Babar Azam Clean Bowled

Babar Azam Clean Bowled

Babar Azam Clean-Bowled: పాకిస్థాన్ వైట్ బాల్ కెప్టెన్ బాబర్ ఆజం ఎంతటి విధ్వంసకరుడో తెలిసిందే. అతను మైదానంలో కుదురుకుంటే అవుట్ చేయడం అసాధ్యంగా భావించేవాళ్లు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అయితే గత వన్డే ప్రపంచకప్ తర్వాత బాబర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఒకదశలో కెప్టెన్ పదవిని కోల్పోయాడు. ఇది కాక సోషల్ మీడియాలో బాబర్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రాక్టీస్ సెషన్లో పాక్ ఆటగాళ్లు వైఖరిని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్న పరిస్థితి. ఇటీవల పాకిస్థాన్(Pakistan) ఆటగాళ్లు కింద పరుపులు పరుచుకుని డై క్యాచ్ లను ఎలా పట్టుకోవాలో ప్రాక్టీస్ చేసి విమర్శలపాలయ్యారు. ఇక తాజాగా మరో ప్రాక్టీస్ సెషన్ వైరల్ అవుతుంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం  (Babar Azam) స్థానిక టోర్నమెంట్‌లో లోకల్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ మహ్మద్ అస్గర్ బాబర్ అజామ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అస్గర్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని బాబర్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ బంతి అతని బ్యాట్ కింద నుంచి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. చిన్న పిల్లాడి బౌలింగ్లో ఒక స్టార్ బ్యాటర్ ఆడాల్సిన విధానం అది కాదు అంటూ నెటిజన్లు బాబర్ ను ట్రోల్స్ చేస్తున్నారు. లూస్ బాల్స్ ను సునాయాసంగా బౌన్దరీ తరలించాల్సిపోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బాబర్ బ్యాటింగ్ శైలిపై సీనియర్లు సైతం ఆందోళన చెందుతున్నారు.

గత ఏడాది కాలంగా బాబర్ ఆజం పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది మూడు ఫార్మాట్లను కలిపి చూస్తే బాబర్ సగటు 33.6 మాత్రమే. సెప్టెంబర్ 12 నుండి పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ సెప్టెంబర్ 12 నుంచి 29 వరకు జరగనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో పాక్‌ మూడు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్ మెరుగ్గా రాణించాలంటే బాబర్ మళ్లీ ఫామ్‌లోకి రావడం తప్పనిసరి. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా బాబర్ అజామ్ చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ పేలవమైన లయ కారణంగా అతనిని కెప్టెన్సీ నుండి తొలగించాలని డిమాండ్లు కూడా లేవనెత్తాయి.

Also Read: Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు, 25వరకు కస్టడీ పొడిగింపు