Delhi Capitals: ఐపీఎల్ 2025కి ఇప్పటి వరకు కెప్టెన్‌ని ప్రకటించని ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఎట్టకేలకు కెప్టెన్‌ని కూడా ప్రకటించింది. ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ కు అక్షర్ పటేల్ ను కెప్టెన్ గా ప్రకటించింది. కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఢిల్లీ ఐపీఎల్ 2025కి అక్షర్‌ను కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఎడమచేతి వాటం ఆటగాడి లక్ష్యం ఇప్పుడు తన జట్టును మొదటిసారి ఛాంపియన్‌గా చేయడమే.
ఈ లీగ్ చరిత్రను పరిశీలిస్తే.. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అందులో పాల్గొంటున్న ఢిల్లీ జట్టు గత 17 ఏళ్లలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది. ఈ సమయంలో జట్టు ఆరుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగలిగింది. జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2020 సంవత్సరంలో మొదటిసారిగా ఫైనల్‌కు చేరింది. అయినప్పటికీ టైటిల్‌కి ఢిల్లీ దూరంగా మిగిలిపోయింది. ఇక గణంకాల ప్రకారం చూస్తే గత 17 ఏళ్లలో జట్టు 14 మంది కెప్టెన్లకు అవకాశం ఇచ్చింది.
Also Read: CM Chandrababu : నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు : సీఎం చంద్రబాబు
గ్రేట్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తొలిసారిగా 2008లో ఈ జట్టుకు నాయకత్వం వహించాడు. 52 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 28 మ్యాచ్‌ల్లో జట్టును విజయపథంలో నడిపించడంలో సఫలమయ్యాడు. సెహ్వాగ్ తర్వాత జట్టు గౌతమ్ గంభీర్, దినేష్ కార్తీక్, జహీర్ ఖాన్, జేమ్స్ హోప్స్, మహేల జయవర్ధనే, కెవిన్ పీటర్సన్, JP డుమిని, రాస్ టేలర్ వంటి విదేశీ ఆటగాళ్లను కూడా కెప్టెన్‌లుగా చేసింది. అయితే ఈ కెప్టెన్లు ఎవరూ జట్టు కోసం టైటిల్ గెలవలేకపోయాయి.
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌కు కెప్టెన్‌ను ప్రకటించింది. గత సీజన్‌లో జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఆడిన స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఫ్రాంచైజీ నియమించింది. అక్షర్ 2019 నుండి ఢిల్లీ జట్టులో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లాగా ఇప్పటివరకు ఢిల్లీ జట్టు కూడా ఒక్క ఐపిఎల్ టైటిల్‌ను కూడా గెలవలేకపోయింది. గతేడాది జరిగిన మెగా వేలంలో అక్షర్‌ను ఢిల్లీ రూ.16.5 కోట్లకు అట్టిపెట్టుకుంది. అక్షర్ కెరీర్‌ను పరిశీలిస్తే.. ఇప్పటి వరకు 150 మ్యాచ్‌ల్లో 21.47 సగటుతో 130.88 స్ట్రైక్‌రేట్‌తో 1653 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి మూడు అర్ధసెంచరీలు వచ్చాయి.