Axar Patel: ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్‌ను తప్పించింది. తాజాగా సమర్పించిన రీటెన్షన్ జాబితాలో పంత్ పేరు లేదు. దీంతో వేలంలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరనేది అందరి మదిలో ఉన్న ప్రశ్న. డిసి తదుపరి కెప్టెన్ కోసం వెతుకుతుంది. తాజా సమాచారం మేరకు రాబోయే సీజన్‌లో ఆల్ రౌండర్ ఆటగాడు అక్షర్ పటేల్ (Axar Patel) ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని చేపట్టవచ్చని వార్తలు వస్తున్నాయి.
మీకు గుర్తుండే ఉంటుంది. గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్ మూడుసార్లు సస్పెండ్ అయినప్పుడు పంత్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఇది మాత్రమే కాదు ఫ్రాంచైజీ అత్యధికంగా 16.5 కోట్లను చెల్లించి అక్షర్‌ను నిలబెట్టుకుంది. పైగా అక్షర్ 6 సీజన్లుగా డిసితోనే ఉన్నాడు. ఈ పరిస్థితిలో అక్షర్ కు కెప్టెన్ గా సరిపోతాడని డిసి యాజమాన్యం భావిస్తుంది. ఇదే సమయంలో వేలంలోనూ మెరుగైన ఆప్షన్‌ను దక్కించుకోవాలని ఆ ఫ్రాంఛైజీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ అయ్యర్‌కు కెప్టెన్సీ, భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయ్యర్‌ను ఢిల్లీ కెప్టెన్‌గా చేయాలనుకుంటే ముందుగా ఈ ఆటగాడిని వేలం నుండి కొనుగోలు చేయాలి.
Also Read: Sunrisers Hyderabad Strategy: ఇవాళ వేలంలో SRH వ్యూహం ఇదే!
దీని కోసం ఫ్రాంచైజీ భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి రావచ్చు. అయ్యర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీంతో వేలంలో అతడి కోసం అగ్రెసివ్‌గా వెళ్లాలని ఆ జట్టు భావిస్తోంది. అయితే, రాబోయే సీజన్‌లో జట్టుకు ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారనే దానిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్ పేర్లు ఉన్నాయి. ఇక రిషభ్ పంత్ కోసం చాలా ఫ్రాంఛైజీలు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పంత్ వేలంలోకి వస్తే 20 నుంచి 25 కోట్ల వరకు ధర పలికే అవకాశముందంటున్నారు.