ENG vs AUS Ashes Test: యాషెస్ రెండో టెస్టులోనూ ఆసీస్ జ‌ట్టుదే విజ‌యం.. బెన్ స్టోక్స్ పోరాటం వృథా ..

ఇంగ్లాండ్ జ‌ట్టుకు మ‌రోసారి ప‌రాభ‌వం ఎదురైంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా మొద‌టి టెస్టులో ఓడిపోయిన ఇంగ్లాండ్ జ‌ట్టు.. ఆదివారం రెండో టెస్టులోనూ ఓట‌మిపాలైంది.

  • Written By:
  • Updated On - July 2, 2023 / 10:08 PM IST

ఇంగ్లాండ్ జ‌ట్టుకు మ‌రోసారి ప‌రాభ‌వం ఎదురైంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా మొద‌టి టెస్టులో ఓడిపోయిన ఇంగ్లాండ్ జ‌ట్టు.. ఆదివారం రెండో టెస్టులోనూ ఓట‌మిపాలైంది. లండ‌న్‌లోని లార్డ్స్ లో జ‌రిగిన యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా జ‌ట్టు 43 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజ‌యం సాధించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన‌ సెంచ‌రీ చేసినా ఇంగ్లాండ్ విజ‌యాన్ని ద‌క్కించుకోలేక పోయింది. ఆదివారం నాలుగో ఇన్నింగ్స్‌లో 371 ప‌రుగుల ఛేద‌న‌లో ఇంగ్లాండ్ 327 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఈ విజ‌యంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆఖ‌రి రోజు ఆరు వికెట్లు చేతిలో ఉండ‌గా 257 ప‌రుగులు చేయాల్సిన ఇంగ్లాండ్.. బెన్ స్టోక్స్ వికెట్ ప‌డ‌టంతో విజ‌యంపై  ఆశ‌లు కోల్పోయింది.

శ‌నివారం ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లాండ్ జ‌ట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 114 ప‌రుగులు చేసింది. విజ‌యం సాధించాలంటే ఐద‌వ రోజు (ఆదివారం) ఇంగ్లాండ్‌ 257 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఆట ప్రారంభ‌మైన త‌రువాత జ‌ట్టు స్కోర్ 177 ప‌రుగుల వ‌ద్ద బెన్ డుకెట్ అవుట్ అయ్యాడు. ఆ త‌రువాత ఒక్కొక్క‌రూ పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. జాన్ బెరిస్టో (10) పెవిలియ‌న్ బాట ప‌ట్టిన త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశాడు. 155 ప‌రుగులు వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఔట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో స్టోక్స్ తో పాటు బెన్ డ‌కెట్ (83) రాణించినా ఫ‌లితం లేక‌పోయింది. ఇంగ్లాండ్ జ‌ట్టు 43 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు జూలై 6 నుంచి లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతుంది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 416 ప‌రుగులు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 325 ప‌రుగులు
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆధిక్యం 91 ప‌రుగులు
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 279 ప‌రుగులు
ఇంగ్లాండ్ 327 ప‌రుగులు

Walking Backwards: బాబోయ్.. వెనక్కి నడవడం వల్ల అన్ని రకాల ప్రయోజనాల?