AUS vs IND: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (AUS vs IND) మధ్య నాలుగో మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా వెల్లడించింది. ఇందులో రెండు ప్రధాన మార్పులు కనిపించగా.. భారత్‌కు అతిపెద్ద శత్రువుగా పిలువబడే ఆటగాడు కూడా నాల్గవ టెస్టుకు ముందు పూర్తిగా ఫిట్‌గా మారాడు. ఇప్పుడు ఆ ఆసీస్ బ్యాట్స్‌మెన్ మెల్‌బోర్న్‌లో భారత బౌలర్లకు తలనొప్పిగా మారేందుకు సిద్ధమయ్యాడు.
ట్రావిస్ హెడ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు
గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత హెడ్‌కు గాయమైందని, నాలుగో టెస్టులో ఆడడం కాస్త కష్టమని చాలా రిపోర్టులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: New Rules For Luggage: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. కొత్త లగేజీ రూల్స్ ఇవే!
హెడ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. “ట్రావిస్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఆడతాడు. హెడ్ పూర్తిగా కోలుకున్నాడు. ట్రావిస్ గాయపడటం గురించి ఆందోళన లేదు. అతను పూర్తిగా ఫిట్‌గా ఆడతాడు ” అని కమిన్స్ ప్రకటించాడు. ఈ సిరీస్‌లో హెడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫామ్‌లో ఉండి ఆస్ట్రేలియా నుండి నిరంతరం పరుగులు చేస్తున్న ఏకైక బ్యాట్స్‌మెన్ హెడ్ మాత్రమే. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ ముందంజలో ఉన్నాడు. అతను తన బ్యాట్‌తో 2 సెంచరీలు కూడా చేశాడు.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌లో 2 మార్పులు
గబ్బా టెస్ట్ సమయంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా దూరమయ్యాడు. జోష్ గాయం చాలా తీవ్రంగా ఉండటంతో అతను మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో స్కాట్ బోలాండ్ ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరాడు. ఇది కాకుండా నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో సామ్ కొన్‌స్టాస్‌ని చేర్చారు. ఇకపోతే రేపట్నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది.