Asian Games : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో ఇండియాకు మరిన్ని పతకాలు వచ్చాయి. తాజాగా శుక్రవారం ఉదయాన్నే జరిగిన 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో భారత పురుషుల టీమ్ కు గోల్డ్ మెడల్ వచ్చింది. స్వాప్నిల్ కుశల్ – ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ – అఖిల్ షీరాన్ లతో కూడిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పీ జట్టు వరల్డ్ రికార్డును బద్దలుకొట్టి 1769 పాయింట్ల స్కోరుతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఇండియా సాధించిన మొత్తం పతకాల సంఖ్య 27కు పెరిగింది. వీటిలో ఏడు గోల్డ్స్, తొమ్మిది వెండి పతకాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.
Also read : Bhagavad Gita – One Crore Students : తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది స్టూడెంట్స్ కు భగవద్గీత పంపిణీ
అంతకుముందు ఇషా సింగ్, పాలక్, దివ్య సుబ్బరాజులతో కూడిన షూటింగ్ టీమ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పిస్టల్ టీం ఫైనల్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో షూటర్ ఈశా సింగ్ కు శుక్రవారం రజత పతకం వచ్చింది. ఈషా సింగ్ నేతృత్వంలోని ఇండియా టీమ్ షూటింగ్‌లో సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకుంది. ఈ టీమ్ లోని ఈషా 579 పాయింట్లు, పాలక్ 577 పాయింట్లు, దివ్య టీఎస్ 575 పాయింట్లు సాధించారు. ఈషా సింగ్ నేతృత్వంలోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ రజత పతకాన్ని కైవసం (Asian Games) చేసుకుంది.