ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశంలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. ఈ సమావేశానికి హాజరైన BCCI ప్రతినిధులు ఆశిష్ షెలార్, రాజీవ్ శుక్లా అకస్మాత్తుగా వాకౌట్ చేయడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీ, మెడల్స్ గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో BCCI ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Daughter Killed Her Mother : ట్యాబ్లెట్లు వేసుకోలేదనే కోపంతో కన్న తల్లిని చంపిన కూతురు
నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తన హోటల్ గదిలో ఉంచుకున్నారని వచ్చిన వార్తలు ఈ వివాదానికి మరింత ఊపునిచ్చాయి. ఈ విషయమై సమావేశంలో ప్రశ్నించినా ఆయన తగిన సమాధానాలు ఇవ్వలేదని BCCI ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కౌన్సిల్ కార్యకలాపాల్లో పారదర్శకత లేకపోవడం వల్లనే ఈ ఉద్రిక్తత చోటుచేసుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
BCCI ఈ విషయాన్ని కౌన్సిల్‌లోని ఇతర బోర్డుల మద్దతుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. నఖ్వీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే ఫిర్యాదు సమర్పించనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఆసియా కప్ ట్రోఫీ, మెడల్స్ అంశంపై ఏర్పడిన ఈ వివాదం ACC ప్రతిష్ఠకు దెబ్బతీయవచ్చని, అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.