Site icon HashtagU Telugu

Team India: ఆసియా కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా!

Asia Cup

Asiacup Imresizer

Team India: ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న గ్రూప్ మ్యాచ్‌లో india టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్, బుమ్రా భారత జట్టులోకి వచ్చారు. భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు వేదికైన క్యాండీలోని పల్లెకెలె మైదానంలో వర్షం కురిసే అవకాశం ఉంది. కానీ టాస్ సమయంలో వర్ష ప్రభావం లేదు. మ్యాచ్ మధ్యలో వర్షం కురిస్తే ఓవర్లను కుదించే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దైతే భారత్, పాకిస్థాన్ జట్లకు 10 పాయింట్లు దక్కుతాయి. దీంతో ఇప్పటికే నేపాల్ పై విజయం సాధించిన పాక్ జట్టు 3 పాయింట్లతో నేరుగా సూపర్ 4 రౌండ్ కు చేరనుంది.

భారత జట్టు

రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(w), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్థాన జట్టు

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్

Also Read: Team India: ఆసియా కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా!