Site icon HashtagU Telugu

India vs Pakistan: టీమిండియా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. భార‌త్‌- పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ ఎప్పుడంటే?

Pakistan

Pakistan

India vs Pakistan: భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఆసియా కప్ మెన్స్ టీ20 ఆసియా కప్ 2025 షెడ్యూల్‌కు సంబంధించి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 4 లేదా 5 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు జరిగే అవకాశం ఉంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ యూఏఈ (UAE)లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఫైనల్ షెడ్యూల్, వేదిక గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈసారి టోర్నమెంట్ కోసం యూఏఈ (UAE) ను న్యూట్రల్ వేదికగా దాదాపు ఖరారు చేసినట్లు భావిస్తున్నారు.

భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 7న దుబాయ్‌లో జరుగనుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఇటీవల ICC చాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా ఇదే మైదానంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ కారణంగా భారత్ ఆసియా కప్ 2025లో పాల్గొనకపోవచ్చనే వార్తలు వచ్చాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సైనిక సంఘర్షణ కారణంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది. కానీ ఇప్పుడు మ్యాచ్ న్యూట్రల్ వేదిక అయిన యూఏఈలో జరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

Also Read: Suparipalana Tholi Adugu : “సుపరిపాలనలో తొలి అడుగు ” కార్యక్రమానికి విశేష స్పందన

ఆసియా కప్ 2025 ఫార్మాట్

గత ఆసియా కప్‌లో ఏమి జరిగింది?

భారత్ డిఫెండింగ్ చాంపియన్. గత ఆసియా కప్ (ODI ఫార్మాట్)లో భారత్ ఫైనల్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించింది.

శ్రీలంక‌లో భారత్-పాకిస్తాన్ ఆసియా కప్ చివరి మ్యాచ్‌?

దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ చివ‌రి మ్యాచ్‌